బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎంతో ఘనంగా నిర్వహించిన ఖమ్మం సభ రాష్ట్రవ్యాప్తంగా హార్ట్ టాపిక్ గా మారింది.అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ సభ వల్ల పార్టీకి కొద్దిగా మైలేజ్ పెరిగినప్పటికీ కెసిఆర్ తాను అనుకున్నది సాధించాడా లేదా అన్న విషయం ఇప్పుడు ప్రధాన చర్చకు దారి తీసింది.
జాతీయస్థాయిలో తన పవర్ ఏమిటో నిరూపించుకోవడానికి కేసీఆర్ ఎంతో కష్టపడి ఈ సభను నిర్వహించాడు.పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా తనతో చేతులు కలపమని ఆహ్వానించాడు.కొందరు ఒప్పుకొని సభకు హాజరయ్యారు.మరికొందరు మాత్రం హ్యాండ్ ఇచ్చారు.
మరి ఇలాంటి భారీ బహిరంగ సభ జరిగినప్పుడు దీని రిజల్ట్ ఏమిటి అన్న విషయంపై పక్క రోజు నుంచి సమీకరణాలు మొదలుపెట్టేస్తారు.
ఇక మొత్తానికి తేలింది ఏమిటి అంటే కెసిఆర్ కు ఈ సభ వల్ల పెద్దగా ఏమీ లాభం చేకూరలేదట.
పైపెచ్చు భారీ ఖర్చు ఒకటి బోనస్ అని చెబుతున్నారు.దాదాపు 100 ఎకరాల్లో నిర్వహించిన ఈ సభలో 75 ఎకరాలు సభ ప్రాంగణం కోసమే వాడారు.కోమటి చెబుతున్నట్టు ఈ సభకు 200 కోట్లు ఖర్చు అయింది అని అంటున్నారు కానీ ఎంత తక్కువ వేసుకున్నా… 125 కోట్లు మాత్రం కనీసం ఖర్చు అవుతుంది.

పైగా మూడు లక్షల మంది జనాలను దృష్టిలో పెట్టుకొని.ఈ సభను నిర్వహించారు మరి అంత మంది వచ్చారా అంటే లక్ష లేదా లక్షన్నర జనాలు మాత్రం ఖచ్చితం వస్తారు అనుకున్నప్పటికీ ఎంతో కష్టం మీద లక్ష మంది వరకు లెక్క తేలారట.వారు కూడా చివరి వరకు లేరు.

పైగా కేసీఆర్ ప్రసంగం పైన ఎన్నో అంచనాలు పెట్టుకుంటే అతని మాటలు కూడా ఆ రోజు పెద్దగా ప్రభావం చూపించలేదు. మరి కెసిఆర్ ఎన్నికలకు ముందు ఇంత ఖర్చు చేసి ఇలా ఫలితం లేని సభలు నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో ఊపు తగ్గే ప్రమాదం ఉంది.దీనికి త్వరగా ప్రత్యామ్యాయాన్ని కేసీఆర్ నిర్ణయించుకోకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు.







