చెల్లిని ప్రేమ పాఠాలు చెప్పి వంచించాడు.అక్కడ మోసగించి రహస్య వివాహమాడాడు.
మాయ మాటలు చెప్పి ఆ కుటుంబం నుండి బంగారాన్ని లక్ష రూపాయలు కాజేసి మోసం చేశాడు.ఆ మహా మాయగాడయిన యువకుడు ని గుంటూరు చేబ్రోలు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదివారం గుంటూరు సౌత్ డి.ఎస్.పి ప్రశాంతి విలేకరితో సమావేశమై వివరాలను వెల్లడించారు.చేబ్రోలు కు చెందిన వేములపల్లి జోష్ బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.
చిలకలూరిపేట కు చెందిన ఓ బాలిక 2019లో వేసవి సెలవుల కోసం చేబ్రోలు లో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది.ఈ మాయ గాడి కన్ను ఆ బాలికపై పడింది.
రోజూ వెంటపడుతూ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే యాసిడి పోస్తానని మీ అమమ్మని చంపేస్తానని బెదిరించాడు.
తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు.
వీడియో కాల్ చేసి ఆమెతో నగ్నంగా మాట్లాడించాడు.డబ్బులు ఇవ్వకపోతే నగ్న వీడియోలు ఫొటోలను సామాజిక మాద్యమంలో పెడతానని బెదిరించాడు.బాలిక వద్ద నుండి బంగారు గొలుసు తీసుకున్నాడు ఆ తర్వాత బాలిక తండ్రి కి ఫోన్ చేసి వీడియోలు ఫోటోలు వేరే వారి దగ్గర తాను చూశానని తొలగించాలంటే చెప్పి 3.30 లక్షలు తీసుకున్నాడు.మరోవైపు వాటిని డిలీట్ చెయ్ ఇస్తానంటూ బాలిక సోదరి తో మాట్లాడి ఆమె నుంచి బంగారం కాజేశాడు.

తర్వాత ఆమె కూడా మాయమాటలు చెప్పి ప్రేమాయణం నడిపాడు ఈ నెల 13న ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు.జోష్ బాబు మోసాన్ని గుర్తించిన బాధితులు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.సి ఎ మధుసూదన్రావు ఎస్ఐ కోటేశ్వరరావు శనివారం రాత్రి నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రశాంతి తెలిపారు అతని వద్ద రెండు బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.