వంకర మూతి పెట్టిన గృహలక్ష్మి నటి కస్తూరి.. అచ్చం అలానే ఉన్నావంటూ ట్రోల్స్?

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇందులో నటిస్తున్న నటీనటులు కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.

 Gruhakshmi Actress Kasturi With A Crooked Mouth Are Trolls Like That , Gruahalak-TeluguStop.com

అందులో ఎక్కువగా ఆకట్టుకున్న పాత్ర తులసి.ఈ తులసి పాత్ర అనేది ప్రేక్షకులను మరింత ఎక్కువగా దగ్గర చేసుకుంది.

ఇక తులసి పాత్రలో నటిస్తున్న నటి అసలు పేరు కస్తూరీ శంకర్.ఈమె తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలలో వెండితెరపై హీరోయిన్ గానూ, సహాయ పాత్రల్లోనూ గాను నటించింది.అంతేకాకుండా బుల్లితెరపై కూడా నటించింది.ఇక ఈమె అప్పట్లో మిస్ మద్రాస్ గా టైటిల్ కూడా సొంతం చేసుకుంది.

పలు షో లలో కూడా వ్యాఖ్యాతగా చేసింది.

తమిళ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగా సందడి చేసింది.

ఇక ఈమె ఎంత బిజీ లైఫ్ లో ఉన్న కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.అప్పుడప్పుడు ఆమె చేసే కౌంటర్ లు బాగా పెలుతూ ఉంటాయి.

రాజకీయ విషయాలలో కూడా బాగా పట్టుతో ఉంటుంది.ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పలువురి రాజకీయ నాయకులను తన స్టైల్ లో విమర్శిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా పలువురు రాజకీయ నాయకులను చాలాసార్లు విమర్శించింది.ఈమె చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి.అలా ఈమె వ్యక్తిగతంగా కూడా బాగా హాట్ టాపిక్ గా నిలుస్తుంది.ఈమె షేర్ చేసుకునే ఫోటోలను చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేం.

లేటు వయసులో కూడా తన అందాలను తెగ ఆరబోస్తుంది.అంతేకాకుండా ఈ తరం హీరోయిన్లు చేసే గ్లామర్ షో చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.నిజానికి ఈమె చేసే గ్లామర్ షోకు కూడా బాగా ట్రోల్స్ ఎదుర్కొంటుంది.అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది.

అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆమె తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో ఆమె బుంగ మూతి, వంకర మూతి పెట్టుకొని ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు.

తన అభిమానులు మాత్రం బుంగమూతి పెట్టావా అడగగా మరి కొంత మంది.ఏంటి నీ మూతికి ఏమయింది.అలా పెట్టావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.మరి కొంత మంది అచ్చం కోతి మూతి లాగే పెట్టావు అంటూ.అచ్చం కోతి లాగే ఉన్నావు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఈమె ప్రస్తుతం గృహలక్ష్మి సీరియల్ తప్ప మరేమీ సీరియల్స్ లలో నటించడం లేదు.

ఇక అప్పుడప్పుడు బుల్లితెరపై ప్రసారమయ్యే షోలల్లో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube