విదేశాలలో ఉద్యోగం అంటే అత్యధిక శాతం భారత్ నుంచీ వలసలు ఉంటాయి ఆయా దేశాలకు.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, అరబ్బు దేశాలకు భారత్ నుంచీ వలసలు వెళ్ళే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.
ఇప్పటికే అమెరికా భారతీయ నిపుణులను ఆకర్షించి నిపుణులైన వారిని తమ దేశంలో ఉద్యోగాలకు ఎగరేసుకు పోగా, బ్రిటన్ సైతం నిపుణులైన భారతీయుల కోసం ఎదురు చూస్తోంది.ఆమాటకొస్తే దాదాపు అన్ని దేశాలు భారతీయ నిపుణులవైపే ఎక్కువగా మొగ్గు చూపుతాయి.
ఈ నేపద్యంలోనే కెనడా తమ దేశంలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని నిపుణులైన వారు ఎంతమంది ఉన్నా తమ దేశంలోకి ఆహ్వానించబడుతారని ప్రకటన చేసింది.ఈ ప్రకటన భారతీయ నిపుణులకు భారీ లబ్ది చేకూర్చనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.
కార్మికుల కొరత, అనేక రకాల కారణాల వలన కెనడాలో భారీ స్థాయిలో ఉద్యోగాలలో ఖాళీలు ఏర్పడ్డాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు 10 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.గత ఏడాది మార్చి సమయంలో 9.88 లక్షల ఉద్యోగాలు ఉండగా ఈ ఏడాదికి సుమారు 10 లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
వైద్య, విద్యా, పర్యాటక, సోషల్ అసిస్టెంట్, రిటైల్, కార్మిక అనేక రంగాలలో ఖాళీలు ఉన్నట్లుగా అక్కడి కార్మిక శాఖ వెల్లడించింది.
ప్రస్తుతం ఉద్యోగుల కొరతతో కెనడాలో పరిస్థితి ఆందోళన కరంగా మారుతోందని, భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ జరుగకపోతే గనుకా కెనడా పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదిలాఉంటే కెనడా విదేశీయులకు ఆకర్షించేందుకు ఎన్నో రకాల వీసాలను అందుబాటులోకి తెచ్చింది.
ఎక్స్ ప్రెస్ ఎంట్రీ, ప్రామిన్షియల్ నామినేషన్ వంటి వీసాల ద్వారా కెనడాలో ఉద్యోగాలు సంపాదించవచ్చు.