గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవద్దని సూచిస్తూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం భారతీయ సంస్కృతి కాదని తెలిపారు.దేవశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలన్న ఎమ్మెల్యే రాజాసింగ్ జనవరి 1వ తేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని తెలిపారని సమాచారం.
యువత తమ స్వస్థలం యొక్క సంస్కృతి తెలుసుకోవాలని, భారతీయులది కానిది ఏదైనా వేడుకలు జరుపుకోవద్దని కోరారు.అయితే ఇటీవలే ఆయన మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.