పక్కా కమర్షియల్ రివ్యూ: గోపీచంద్ సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందిన సినిమా పక్కా కమర్షియల్. యు వి క్రియేషన్స్, జి ఎ టు పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మతగా బాధ్యతలు చేపట్టాడు.

 Gopichand Raashi Khanna Pakka Commercial Movie Review And Rating Details,  Pakka-TeluguStop.com

ఇందులో గోపీచంద్, రాశిఖన్నా నటీనటులుగా నటించారు.సత్యరాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

కర్మ్ చావ్లా ఛాయా గ్రహణం అందించాడు.జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.అంతేకాకుండా గోపీచంద్ కు ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.

కథ:

ఇందులో రాంచంద్ (గోపిచంద్) అనే పాత్రలో నటించాడు.అంతేకాకుండా లాయర్ పాత్రలో కనిపించాడు.

ఇక ఇతని దృష్టిలో ప్రతీది పక్కా కమర్షియల్ గా ఉంటుంది.ఇక ఇతడు చాలా సంవత్సరాల తర్వాత లాయర్ గా తిరిగి తన ఉద్యోగంలోకి చేరుతాడు.

ఇక ఆ సమయంలోనే తనకు సీరియల్ నటి ఝాన్సీ (రాశిఖన్నా) పరిచయం అవుతుంది.ఆమె తన సీరియల్ కోసం లాయర్ పాత్రలో నటించడానికి అతని దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది.

ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో కూడా పడతారు.ఇక రాంచంద్ ఒక కేసు విషయంలో అతని తండ్రితో వాదిస్తాడు.

ఇక ఆ కేసును టేకప్ కూడా చేస్తాడు.మరి ఎందుకు టేకప్ చేయాల్సి వస్తుంది.

అసలేం జరిగింది.మరి తనని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

Telugu Gopichand, Raashi Khanna, Pakka, Pakka Review, Pakka Story, Review, Tolly

నటినటుల నటన:

ఇందులో గోపీచంద్ తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అంతేకాకుండా తన నటనతో, తన కామెడీతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను తాకాడు.ఇక రాశిఖన్నా కూడా తన పాత్రకు న్యాయం చేసింది.మిగతా నటీనటులు అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా ఈ సినిమాకు మారుతి దర్శకుడిగా తనదైన మార్క్ చూపించాడు.ఇక కామెడీ టైమింగ్ తో సినిమాను బాగా నడిపించాడు.

ప్రేక్షకులను తన కామెడీతో బాగా నవ్వించాడు.ఇక యాక్షన్ అంతగా చూపించలేకపోయాడు డైరెక్టర్.

క్లైమాక్స్ కూడా అద్భుతంగా చూపించాడు.మారుతికి ఈ సినిమా కెరీర్ పరంగా బెస్ట్ సినిమాగా నిలిచింది.

కర్మ్ చావ్లా అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.ఇక జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఉంది.ఇతర టెక్నీషియల్ విభాగాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Gopichand, Raashi Khanna, Pakka, Pakka Review, Pakka Story, Review, Tolly

విశ్లేషణ:

సినిమాను అద్భుతమైన కథతో చూపించాడు మారుతి.కామెడీని మాత్రం బాగా అందించాడు.యాక్షన్ పరంగా కాకుండా కామెడీ పరంగా గోపీచంద్ కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.గోపీచంద్ తన పాత్రతో మరో కొత్త లుక్ ను చూపించాడు.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అనిపించింది.సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.

బాటమ్ లైన్:

చివరగా కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube