పక్కా కమర్షియల్ రివ్యూ: గోపీచంద్ సినిమా ఎలా ఉందంటే?

డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందిన సినిమా పక్కా కమర్షియల్.యు వి క్రియేషన్స్, జి ఎ టు పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మతగా బాధ్యతలు చేపట్టాడు.

ఇందులో గోపీచంద్, రాశిఖన్నా నటీనటులుగా నటించారు.సత్యరాజ్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో నటించారు.

కర్మ్ చావ్లా ఛాయా గ్రహణం అందించాడు.జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు.

ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

అంతేకాకుండా గోపీచంద్ కు ఎటువంటి సక్సెస్ అందిందో చూద్దాం.h3 Class=subheader-styleకథ:/h3p ఇందులో రాంచంద్ (గోపిచంద్) అనే పాత్రలో నటించాడు.

అంతేకాకుండా లాయర్ పాత్రలో కనిపించాడు.ఇక ఇతని దృష్టిలో ప్రతీది పక్కా కమర్షియల్ గా ఉంటుంది.

ఇక ఇతడు చాలా సంవత్సరాల తర్వాత లాయర్ గా తిరిగి తన ఉద్యోగంలోకి చేరుతాడు.

ఇక ఆ సమయంలోనే తనకు సీరియల్ నటి ఝాన్సీ (రాశిఖన్నా) పరిచయం అవుతుంది.

ఆమె తన సీరియల్ కోసం లాయర్ పాత్రలో నటించడానికి అతని దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది.

ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో కూడా పడతారు.ఇక రాంచంద్ ఒక కేసు విషయంలో అతని తండ్రితో వాదిస్తాడు.

ఇక ఆ కేసును టేకప్ కూడా చేస్తాడు.మరి ఎందుకు టేకప్ చేయాల్సి వస్తుంది.

అసలేం జరిగింది.మరి తనని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

"""/"/ H3 Class=subheader-styleనటినటుల నటన:/h3p ఇందులో గోపీచంద్ తన పాత్రతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా తన నటనతో, తన కామెడీతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను తాకాడు.ఇక రాశిఖన్నా కూడా తన పాత్రకు న్యాయం చేసింది.

మిగతా నటీనటులు అంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.h3 Class=subheader-styleటెక్నికల్:/h3p టెక్నికల్ పరంగా ఈ సినిమాకు మారుతి దర్శకుడిగా తనదైన మార్క్ చూపించాడు.

ఇక కామెడీ టైమింగ్ తో సినిమాను బాగా నడిపించాడు.ప్రేక్షకులను తన కామెడీతో బాగా నవ్వించాడు.

ఇక యాక్షన్ అంతగా చూపించలేకపోయాడు డైరెక్టర్.క్లైమాక్స్ కూడా అద్భుతంగా చూపించాడు.

మారుతికి ఈ సినిమా కెరీర్ పరంగా బెస్ట్ సినిమాగా నిలిచింది.కర్మ్ చావ్లా అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

ఇక జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం అంతగా ఆకట్టుకోలేకపోయింది.బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఉంది.

ఇతర టెక్నీషియల్ విభాగాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. """/"/ H3 Class=subheader-styleవిశ్లేషణ:/h3p సినిమాను అద్భుతమైన కథతో చూపించాడు మారుతి.

కామెడీని మాత్రం బాగా అందించాడు.యాక్షన్ పరంగా కాకుండా కామెడీ పరంగా గోపీచంద్ కూడా తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

గోపీచంద్ తన పాత్రతో మరో కొత్త లుక్ ను చూపించాడు.h3 Class=subheader-styleప్లస్ పాయింట్స్:/h3p నటీనటుల నటన, కామెడీ, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.

H3 Class=subheader-styleమైనస్ పాయింట్స్:/h3p సెకండ్ హాఫ్ కాస్త స్లోగా అనిపించింది.సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.

H3 Class=subheader-styleబాటమ్ లైన్:/h3p చివరగా కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది.

H3 Class=subheader-styleరేటింగ్: 3/5/h3p.

ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు..!!