టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన గోపీచంద్( Gopichand ) కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరోకు ప్రస్తుతం మూవీ ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు.
టాలీవుడ్ హీరో గోపీచంద్ కు ఫ్లాప్ డైరెక్టర్లు దిక్కయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మంచి రోజులు వచ్చాయి ఫ్లాప్ తర్వాత గోపీచంద్ మారుతికి ఛాన్స్ ఇచ్చారు.
మారుతి గోపీచంద్ కాంబినేషన్ లో పక్కా కమర్షియల్( Pakka Commercial ) సినిమా తెరకెక్కగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.సాక్ష్యం సినిమాతో ఫ్లాప్ ను ఖాతాలో వేసుకున్న శ్రీవాస్ డైరెక్షన్ లో గోపీచంద్ రామబాణం( Ramabanam ) సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం గోపీచంద్ వరుసగా రెండు ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పారు.
గోపీచంద్ శ్రీనువైట్లకు ఒక ఛాన్స్ ఇవ్వగా గోపీచంద్ శ్రీనువైట్ల( Srinu Vaitla ) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది.శ్రీనువైట్ల గత 4 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.ఈ డైరెక్టర్ తో గోపీచంద్ సినిమా చేయడం ఫ్యాన్స్ కు ఏ మాత్రం ఇష్టం లేదు.
అయితే గోపీచంద్ రాధేశ్యామ్ సినిమాతో ప్రభాస్ కు డిజాస్టర్ ఇచ్చిన రాధాకృష్ణ కుమార్ కు కూడా ఛాన్స్ ఇక్ఛారని తెలుస్తోంది.గోపీచంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాలతో సక్సెస్ సాధించని పక్షంలో గోపీచంద్ కెరీర్ కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పవచ్చు.
గోపీచంద్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండగా గోపీచంద్ పారితోషికం ప్రస్తుతం 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.గోపీచంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.