స్పీకర్ వ్యవహారించిన తీరు సరికాదు..: అచ్చెన్నాయుడు

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.వైసీపీ మంత్రులు, సభ్యులే రెచ్చగొట్టే విధంగా సభలో ప్రవర్తించారన్నారు.

 Speaker's Behavior Is Inappropriate..: Atchennaidu-TeluguStop.com

దీనికి ప్రతిఘటనగా బాలకృష్ణ స్పందించారని తెలిపారు.

తమ పార్టీ నాయకుడు చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని, కేసులు ఉపసంహరించుకుని విడుదల చేయమని సభా వేదికగా అడిగితే ప్రతిపక్షంపై కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

స్పీకర్ తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియజేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.శాసన సభలో స్కిల్ డెవలప్ మెంట్ పై చర్చిస్తామంటున్నారు.

అయితే చర్చించడానికి అక్కడ కేసే లేదు కదా అని ప్రశ్నించారు.అక్రమ కేసు బనాయించి దానిపై ఏమని చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు.

అదేవిధంగా శాసనసభలో స్పీకర్ వ్యవహరించిన తీరు సరికాదని తెలిపారు.ఏదీ ఏమైనా టీడీపీ నినాదం ఒకటేనని చెప్పారు.

ఎటువంటి ఆధారాలు లేకపోయినా అవినీతి జరిగిందని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube