తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్ అందింది.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మందు విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపులు తెరిచి ఉండనున్నాయి.అయితే పోలీసులు కొన్ని నిబంధనలు విధించారు.
త్రీ స్టార్, హోటల్స్, పబ్బులు, క్లబ్బుల వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్ ఏరియాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా శబ్ధ తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని నిబంధన విధించారు.