మంచి స్వింగ్ లో వున్న గోద్రేజ్ కన్స్యూమర్... పార్క్ అవెన్యూ సహా ఇతర బ్రాండ్లు కొనుగోలు!

మనకు గోద్రేజ్ కంపెనీ( Godrej Company ) చిన్నప్పటినుండి పరిచయమే.ఎందుకంటే ఇది ఈనాటిది కాదు.

 Godrej Consumer In A Good Swings Buy Other Bonds Including Park Avenue , Raymond-TeluguStop.com

గోద్రేజ్ గ్రూప్ సంస్థని 1897వ సంవత్సరంలో అర్దేషిర్ గోద్రెజ్, పిరోజ్షా బుర్జోర్జీ గోద్రెజ్ ( Ardeshir Godrej, Pirozsha Burjorji Godrej )స్థాపించారు.లీవర్ టెక్నాలజీతో తాళాలను భారతదేశంలో ప్రవేశ పెట్టిన మొట్టమొదటి కంపెనీ ఇదే.కాగా ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.భారతదేశంలో మొదటి స్వదేశీ టైప్ రైటర్ను ఉత్పత్తి చేసిన మొదటి సంస్థ గోద్రెజ్ కావడం విశేషం.

శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న గోద్రెజ్ అభివృద్ధి నాటినుండి నేటివరకు నిరాటంకంగా సాగుతోంది అంటే అతిశయోక్తి లేదు.

గోద్రెజ్ సంస్థ నుండి అనేక ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి.గృహోపకరణాలు, ఫర్నిచర్ లు, ఏరోస్పేస్, కన్స్యూమర్ గూడ్స్, అగ్రికల్చర్ మొదలైనవి దీనిలో భాగమైనాయి.ఈ క్రమంలోనే తాజాగా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ దేశీయ డియొడరెంట్స్, వెల్‌నెస్ విభాగంలో దిగ్గజ బ్రాండ్‌గా ఉన్న రేమండ్ కన్స్యూమర్ కేర్ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ( Raymond Consumer Care Limited FMCG ) వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం.

దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య ఈ గురువారం ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.

రేమండ్ కన్స్యూమర్ ఎఫ్ఎంసీజీ విభాగంలో పార్క్ అవెన్యూ, కేఎస్, కామసూత్ర, ప్రీమియం వంటి బ్రాండ్ ఉత్పత్తులను విక్రయిస్తోందనే విషయం అందరికీ తెలిసినదే.ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ కొనుగోలు కోసం జీసీపీల్ రూ.2,825 కోట్లను చెల్లించనుందని భోగట్టా.ఇక ఒప్పంద ప్రక్రియ ఈ ఏడాది మే 10 నాటికి పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ తరుణంలో రేమండ్ గ్రూప్ వైస్-చైర్మన్ అతుల్ సింగ్ మాట్లాడుతూ… తమ పార్క్ అవెన్యూ, కామసూత్ర బ్రాండ్లను గోద్రేజ్‌కు విక్రయించడం ద్వారా వాటి వృద్ధి మరింత పెంచేందుకు వీలవుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube