ప్రముఖ సింగర్ గీతామాధురి ( Geetha Madhuri )ఒకవైపు సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు బుల్లితెర షోలలో మెంటర్‌గా వ్యవహరిస్తోంది.ఈ పాలకొల్లు అమ్మాయి రీసెంట్ గా పాడిన అఖండలోని “జై బాలయ్య” పాట సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ ముద్దుగుమ్మ పాడిన చాలా మాస్ బీట్ సాంగ్స్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.ఈ సింగర్ 100% ఫేమ్ నందుని పెళ్లి చేసుకుంది.
నందు( Nandu ) ఇటీవల కాలంలో సెహరి, బొమ్మ బ్లాక్ బస్టర్ వంటి సినిమాల్లో కనిపించాడు.గీతా మాధురి పెళ్లయిన సమయం నుంచి నందు చాలా అన్యోన్యంగా జీవిస్తోంది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతా మాధురి తనకున్న ఒక వింత అలవాటు గురించి చెప్పింది.
ఆమె మాట్లాడుతూ.“క్యాసినో( Casino ) అంటే నాకు చాలా పిచ్చి.దానిపై అంత పిచ్చి ఎందుకు ఉంటుందో తెలియదు గానీ క్యాసినోలోకి వెళ్ళగానే నేను పెద్ద జూదరిని (జూదం ఆడే మహిళ) అయిపోతాను.” అని చెప్పింది.అయితే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రూ.3 లక్షలు ఆస్ట్రేలియా( Australia )లో పోగొట్టారంట కదా అని అడిగితే.“అవును, ఇంకా చాలా పోగొట్టాను.ఎందుకులెండి అవన్నీ” అంటూ తెగ సిగ్గు పడిపోయింది.క్యాసినోలోకి వెళ్లేసరికి నాకు ఏదో అయిపోతుంది.బ్లాక్ జాక్ అనే ఒక గేమ్ ఉంటుంది.అది నాకు బాగా నచ్చేసింది.
ఒకానొక సమయంలో ఇక క్యాసినోకి అసలు వెళ్ళకూడదు అనుకున్నాను.మా తల్లిదండ్రులకు అది ఎలా ఉంటుందో ఒకసారి చూపించి ఆ తర్వాత ఎప్పుడూ కూడా దాని ముఖం చూడకూడదని ఒట్టు పెట్టేసుకున్నాను.” అని చెప్పింది.</br
డబ్బులు పోయినా వచ్చినా ఈ గేమ్ లో ఎంజాయ్మెంట్ ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం సింగర్ గీతా మాధురి చేసిన ఈ వ్యాఖ్యలు స్పెషల్ మీడియాలో వైరల్ గా మారాయి.“పాటలు పాడటం, షోలు చేయడం ద్వారా గీతామాధురి బాగా డబ్బు సంపాదిస్తుందనుకుంటా.అందుకే ఇలా వృధా ఖర్చులు చేస్తుంది, లక్షల్లో డబ్బులు పోగొట్టడం ఏందీ?” అని చాలామంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.ఏది ఏదేమైనా గీతామాధురి చాలా స్వేచ్ఛగా బతుకుతుంది.
తనకి నచ్చినప్పుడు పని చేస్తుంది, లేదంటే ఇంటికే పరిమితం అవుతుంది.ఆమె భర్త నందు కూడా గీతామాధురి విషయంలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడు.
ఈ విషయాన్ని ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో స్పష్టంగా తెలిపింది.మొత్తం మీద ఈ సింగర్ కెరీర్ పర్సనల్ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తోంది.