ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడి వేడిగా ఉంది.చంద్రబాబు( Chandrababu ) పుంగనూరు పర్యటనలో జరిగిన దాడులు ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి.
ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అంటూ నిన్న పులివెందులలో పర్యటించిన చంద్రబాబు నాయుడు నేడు పుంగనూరులో( Punganuru ) పర్యటించడానికి బయలుదేరారు.ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి జరగడంతో.
ఒక్కసారిగా వాతావరణం రణరంగంగా మారింది.పార్టీ అధినేత చంద్రబాబు పర్యటన అడ్డుకునే రీతిగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది.
దీంతో పుంగనూరు ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.
ఇదిలా ఉంటే సీఎం జగన్( Cm Jagan ) పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు( Ganta srinivasa rao ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆరోపించారు.నవరత్నాలలో ఒక రత్నానైనా 100% పూర్తిగా అమలు చేశారా అని ప్రశ్నించారు.జగన్ ఇచ్చిన హామీలలో 98.5% అమలు చేయలేదని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులకు హామీ ఇచ్చి తర్వాత వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.మద్యపాన నిషేధం.ప్రత్యేక హోదా విషయంలో జగన్ విఫలమయ్యారని గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.