ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు పోలీసుల దుర్మరణం..

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయి జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎచ్చెర్ల ఏఆర్ పోలీసులు నలుగురు మృతి చెందారు.మందస మండలం బైరి సారంగపురం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

 Four Policemen Killed In Road Accident , Road Accident , Four Policemen , Kash-TeluguStop.com

పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలడంతో డివైడర్ ను  ఢీ కొట్టింది అక్కడినుంచి పక్కన గల రహదారిపైకి వచ్చి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.నలుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు మృతుల్లో ఏఆర్ ఎస్ఐ కృష్ణ నాయుడు, కానిస్టేబుల్ బాబురావు, జనార్దన్ రావు, పీటీ ఆంటోని ఉన్నారు.

ప్రమాద వివరాలను కాశీబుగ్గ సీఐ శంకర్రావు తెలిపారు  ఎచ్చెర్ల ఏఆర్ కి చెందిన వారిగా వెల్లడించారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు.రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందిన సమాచారం తెలుసుకున్న రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు  ఘటనా స్థలానికి చేరుకున్నారు.విది నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube