ప్రస్తుత కాలంలో వ్యాపారం( Business ) చేసి సక్సెస్ సాధించడం కత్తి మీద సాము అనే సంగతి తెలిసిందే.పెద్దపెద్ద వ్యాపారవేత్తలు సైతం వ్యాపారాల్లో రాణించడం కష్టమవుతోంది.
అయితే ఒక మహిళ మాత్రం కేవలం 2 లక్షల రూపాయల పెట్టుబడితో 1290కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు.ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ మహిళ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.
ఈ మహిళ సక్సెస్ స్టోరీ( Success Story ) గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పుకోవచ్చు.
మీరా కులకర్ణి( Mira Kulkarni ) బలమైన లక్ష్యంతో గడ్డిపరకను సైతం బ్రహ్మాస్త్రంగా మలచుకున్నారు.
చెన్నైలోని ప్రముఖ కాలేజ్ నుంచి మీరా ఫైన్ ఆర్ట్స్ లో పట్టా తీసుకున్నారు.ప్రేమించిన వ్యక్తి కోసం మీరా 20 ఏళ్ల వయస్సులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయారు.
ఇద్దరు పిల్లలు పుట్టేవరకు మీరా జీవితం సంతోషంగానే సాగింది.భర్తకు వ్యాపారంలో నష్టం రావడం వల్ల అతను మద్యానికి బానిసై మీరాకు నరకం చూపించేవాడు.
ఆ తర్వాత మీరా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పుట్టింటికి వచ్చారు.అదే సమయంలో తల్లీదండ్రులు చనిపోవడంతో మీరా పరిస్థితి మొదటికొచ్చింది.ఇంటిలోని ఓ భాగాన్ని అద్దెకిచ్చిన మీరా రూపాయి రూపాయి పొదుపు చేసి పిల్లల్ని స్థిరపడేలా చేశారు.ఆ తర్వాత మీరా కొవ్వొత్తుల బిజినెస్ ను మొదలుపెట్టడంతో పాటు సొంతంగా సబ్బులను తయారు చేసేవారు.2 లక్షల పెట్టుబడితో ఫారెస్ట్ ఎసెన్షియల్స్( Forest Essentials ) బిజినెస్ ను మొదలుపెట్టారు.
ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 115 స్టోర్ లు ఉన్నాయి.తాజ్ గ్రూప్, ది ఒబెరాయ్ లాంటి ప్రముఖ హోటళ్లు ఈ సంస్థ వినియోగదారులుగా ఉన్నాయి.ప్రస్తుతం ఈ సంస్థ 120 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.
ప్రస్తుతం ఈ మహిళ మన దేశంలోని అత్యంత సంపన్న మహిళలలో ఒకరిగా ఉన్నారు.మీరా కులకర్ణి సక్సెస్ స్టోరీ( Mira Kulkarni Success Story ) ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.