దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ దళితబందు రూపంలో విత్తనాలు చల్లారు అవి మహావ్రుక్షాలుగా ఎదగాలి కష్టాల్ని అర్థం చేసుకొని పరిష్కరించే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు నూరేళ్లు వర్థిల్లాలి20 కోట్ల విలువ గల 270 వాహనాలు దళితబందు ద్వారా గ్రౌండింగ్.నిన్నటి వరకూ డ్రైవర్లు, నేడు ఓనర్లు మహనీయుడు బాబూ జగ్జీవన్ రాం జయంతి రోజున మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కరీంనగర్లో దళితబందు గ్రౌండింగ్, బాబూజీ వేడుకల్లో మంత్రి గంగుల కమలాకర్.
బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు, ఏ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం బాబూజీ కృషి చేసారో ఆ కలల్ని సాకారం చేసే దిశగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో దేశంలో ఎక్కడాలేని విదంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షలు అందించే దళిత బందు కార్యక్రమం ప్రారంభించామన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. హుజురాబాద్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అమలు చేసే దిశగా కదులుతూనే ప్రతీ నియోజకవర్గంలో 100 యూనిట్లను తొలిదశలో అందజేస్తున్నామన్నారు.
ఇందుకోసం క్రుషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దళితులు, వెనుకబడిన వర్గాల పక్షాన నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయ:రారోగ్యాలతో వర్థిల్లాలని దీవెనార్థులు అందిస్తున్నామన్నారు మంత్రి గంగుల.
దశల వారీగా ప్రతీ దళితకుంటుంబం పది లక్షల రూపాయల్ని ఇవ్వడం ద్వారా బాబూజీ కలల్సి సాకారం చేస్తున్నామన్నారు, ఒక్క రూపాయి కూడా బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షల రూపాయలను నేరుగా వారి అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు.
దీంతో నిన్నటివరకూ డ్రైవర్లు గా ఉన్నవాళ్లు సీఎం కేసీఆర్ గారి దీవెనతో ఓనర్లుగా మారారన్నారు.ఈఎంఐ బాదరబందీ లేకుండా చూడడమే కాదు వీరికి ప్రభుత్వ శాఖల్లోని పనులను ఇచ్చే దిశగా కృషిచేస్తామన్నారు, తొలుత తన పరిధిలో ఉన్న బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల పరిధిలో వారికి పనులు కల్పించే విదంగా చర్యలు చేపడుతామన్నారు.
ఇలా ఒకటికి రెండుగా ఇంతింతై దళితబందు లబ్దీదారులు ఎదగాలని మంత్రి గంగుల ఆకాంక్షించారు, కేసీఆర్ గారు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం విత్తనాలు చల్లారని ఇవి మహా వ్రుక్షాలుగా మారాలని ఆకాంక్షించారు మంత్రి గంగుల.బాబూజీ జయంతి రోజున ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్.
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో నర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు ఇరవై కోట్ల విలువ గల 270 వాహనాలు లబ్దీదారులకు అందజేసారు.40 జాస్పర్ వాహనాలు, 60 అశోక్ లేలాండ్, 80 మోటార్ లేన్, 12 సాబూ, 52 హరిహరా, 26 కంబైన్డ్ ఆటోమోటీవ్స్ చెందిన వాహనాలను లబ్దీదారులు ఎంచుకున్నారని వాటన్నింటిని బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా అందజేసారు మంత్రి గంగుల కమలాకర్.ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సూడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరీ శంకర్, కార్పొరేటర్లు ఎదుల్లా రాజశేఖర్, సుదగోని మాధవి-క్రిష్ణ గౌడ్ హుజురాబాద్ మున్సిపల్ ఛైర్మన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు