కన్నీళ్లు తూడుస్తున్న ఓటిటిలు.. ఎందుకో తెలుసా?

కరోనా వైరస్ కాలంలో ఓటిటి లకు ఎంతలా ప్రియారిటి పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇంటి నుంచి కాదు బయట పెట్టలేనని సమయంలో ఓటిటిలో సినిమాలు విడుదల కావడంతో ఇంట్లో ఉండే హాయిగా సినిమాలు చూశారు.

 Flop Movies Turns Eye Feast To Ott Acharya Sarkaru Vari Paata Tuck Jagadish Deta-TeluguStop.com

అంతేకాదు వివిధ రకాల వెబ్ సిరీస్ లు అంటూ ఓటిటి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ కూడా పంచింది.ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత కూడా ప్రేక్షకులు ఓటిటి లలో చూడటానికి ఎక్కువగా ఎందుకు పెడుతున్నారు.

కానీ థియేటర్లకు వెళ్లి జేబుకు చిల్లు పెట్టుకోడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.థియేటర్కు వెళ్తే ఎంత తక్కువైనా దాదాపు 500 ఖర్చు అవుతుంది.

అటువంటి ఓటిటిలకు మాత్రం 200 లోపే తమ నెలవారి సబ్స్క్రిప్షన్ ఉంటుంది.దీంతో ఇలా ఓటిటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు ప్రేక్షకులు.ఇలాంటి సమయంలోనే ఓటిటిలు రావడంతో థియేటర్ల యాజమాన్యాలను నష్టాలు వస్తున్నాయంటూ మొన్నటివరకు టాలీవుడ్ నిర్మాతల సంఘం గళమెత్తింది.ఓటిటి విషయంలో కచ్చితమైన నిబంధనలు పెట్టాలంటూ చర్చలు కూడా జరిగాయి.

ఎంతోమంది ఓటీటీ ప్లాట్ఫాం పై విమర్శలు కూడా చేశారు.అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా భారీ బడ్జెట్ పెట్టి కోట్ల రూపాయల నష్టం తో బాధపడుతున్న ఎంతోమందికి ఓటిటిలే కన్నీళ్లు తూడుస్తున్నాయి అని అర్థమవుతుంది.

భారీ అంచనాల మద్య వచ్చిన ఆచార్య డిజాస్టర్.చాలా ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు నష్టమే వచ్చింది.

Telugu Acharya, Flop, Flop Ott, Ott, Producers, Sarkaruvaari, Tollywood, Tuck Ja

దీంతో ఈ సినిమాని రెండు వారాల ముందుగానే ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.అదనంగా 10 కోట్ల వరకు తీసుకుని ఇక వాటిని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు అందించారు.సర్కారు వారి పాట, శ్యాం సింగరాయి, టక్ జగదీష్ లాంటి సినిమాల విషయంలో కూడా ఇదే జరిగిందట.ఒప్పందం చేసుకున్న దాని కంటే ముందుగానే సినిమాను ఓటిటిలో విడుదల చేయడం వల్ల అదనంగా కొంత మొత్తాన్ని నిర్మాతలకు ఇస్తున్నాయ్ ఓటిటిలు.

ఇక నిర్మాతలు ఇచ్చిన డబ్బులతో నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నారట.ఇలా తిట్టి పోసిన ఓటిటిలే కన్నీళ్లు తూడుస్తున్నాయి అన్నది అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube