'నల్ల' కుబేరులకు మూడు నెలల గడువు

‘మేం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విదేశాల్లోని ‘నల్ల’ ధనం రప్పిస్తాం’….ఇదీ ఎన్నికల సమయంలో, అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ, భాజపా నాయకుల వాగ్దానం.

 Government Extends Deadline For Declaring Black Money-TeluguStop.com

ఏడాది ఉత్సవాలు కూడా జరుపుకున్నారు.ఏమైంది? నాయకుల మాట నీటి మూటైంది.మూన్నాళ్ల ముచ్చటైంది.ఇప్పుడు నల్లధనం వివరాలు చెప్పేందుకు ప్రభుత్వం నల్ల కుబేరులకు మరో మూడు నెలల సమయం ఇచ్చింది.అంటే ఈ ఏడాది సెప్టెంబరు ముప్పయ్యో తేదీ నాటికి వివరాలు తెలియచేయాల్సి ఉంటుంది.గడువు లోగా వివరాలు చెప్పకపోతే కుబేరులపై భారీగా పెనాల్టీ విధిస్తారట…! నల్ల ధనానికి సంబంధించి చేసిన కొత్త చట్టం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది.

దాని ప్రకారం విపరీతమైన పెనాల్టీ వేస్తారు.క్రిమినల్‌ చర్యలు తీసుకొని పదేళ్ల జైలు శిక్ష కూడా వేస్తారు.

నల్ల డబ్బు ఎవరికి ఉంటుందో తెలుసు.కోటీశ్వరులు, శత కోటీశ్వరుల దగ్గర ఉంటుంది.

నల్ల డబ్బు దాచేవారు ఆ పని చాల జాగ్రత్తగా, ఎవ్వరికీ చిక్కకుండా చేస్తారు.వీరంతా రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, పెద్ద పరిశ్రమల అధిపతులు…ఇలా ఉంటారు.

వీరికి ప్రభుత్వంలోని పెద్దలతో మంచి సంబంధాలు ఉంటాయి.కొందరు ప్రభుత్వంలోనే ఉంటారు కూడా.

వీరు నల్లధనం వివరాలు చెబుతారంటే నమ్మగలమా? చెప్పినా నిజాలు చెబుతారా? నల్ల డబ్బు వివరాలే తెలుసుకోలేని పాలకులు, నల్ల డబ్బును ఎలా రప్పిస్తారు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube