వందల కోట్ల పెట్టుబడి.. వేల కోట్ల రాబడి.. ఆ సినిమాలు ఏంటంటే?

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి జీవితం మారిపోతుందో చెప్పలేం.ఒక్కొక్కరికి ఈ సినీ ఇండస్ట్రీ కలిసొస్తే.

 Films Made With Hundreds Crores Earn Thousands Crores, Kgf 1, Kgf 2, Bahubali 1,-TeluguStop.com

కొంత మందికి మాత్రం అస్సలు కలిసి రాదు అనే చెప్పాలి.చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు కోట్ల రూపాయలను వసూళ్లు చేసిన ఉన్నాయి.

అలాగే కోట్ల రూపాయలతో నిర్మించిన సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యి భారీ నష్టాలు తెచ్చిపెట్టిన మూవీలు కూడా ఉన్నాయి.వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమాలు వేల కోట్లను కలెక్ట్ చేయడం మాములు విషయం కాదు.

మరి ఈ స్థాయిలో వేళా కోట్లను రాబట్టి భారీ లాభాలను అందుకున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Bahubali, Hundredsearn, Kgf, Pathaan-Movie

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా కోసం 250 కోట్లను నిర్మాతలు ఖర్చు చేయగా 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా తెరకెక్కింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల పెట్టుబడితో నిర్మించగా 1235 కోట్ల రూపాయలను రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది.

అలాగే బాలీవుడ్ లో ఈ మధ్యన రిలీజ్ అయినా షారుఖ్ ఖాన్ పఠాన్ కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.షారుఖ్, దీపికా హీరో హీరోయిన్లుగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 205 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.

ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమా ఏకంగా 970 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube