ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు కరోనా వైరస్ పేరు వింటే గజగజా వణుకుతున్నారనే విషయం తెలిసిందే.సోషల్ మీడియాలో , వెబ్ మీడియాలో కరోనా వైరస్ కు సంబంధించిన ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో రోడ్డుపై 200, 300 మంది పడిపోయిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.కరోనా వైరస్ బారిన పడి చనిపోయినట్లు ఫేక్ ఫోటో వైరల్ అవుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అంబూజ్ ప్రతాప్ సింగ్, అర్చిత్ మెహతా “కరోనా వైరస్ భారత్ లోకి కూడా ప్రవేశించిందని చైనాలోని కరోనా వైరస్ పర్యావసానం ఇదీ” అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.కానీ ఈ ఫేక్ ఫోటో గురించి విచారణ చేయగా ఈ ఫోటో గురించి అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఆరేళ్ల క్రితం జర్మనీ దేశంలో ఒక కళాకారుల బృందం చేసిన ప్రదర్శనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
528 కళాకారులు జరిపిన ప్రదర్శనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో కరోనా వైరస్ కు సంబంధించిన ఫోటో అంటూ వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో నకిలీ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.కానీ అవి నిజం ఫోటోలో నకిలీ ఫోటోలో తెలుసుకోవడం ఈ కాలంలో పెద్ద కష్టమైన పనేం కాదు.
యాండెక్స్ అనే యాప్ ను ఉపయోగించి ఏ ఫోటో అసలుదో ఏ ఫోటో నకిలీదో ఏ ఫోటో ఎక్కడ ఎప్పుడు ప్రచురించారో సులభంగా తెలుసుకోవచ్చు.