ఇంకా ఫామ్ లోకి రాని సుకుమార్ శిష్యులు.. ఎవరంటే..?

ఆర్య సినిమాతో సుకుమార్( Sukumar ) రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.పుష్ప సినిమా తర్వాత గ్లోబల్ రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.

 Failure Assistants Of Director Sukumar , Director Sukumar , Failure Assistants ,-TeluguStop.com

ఈ లెక్కల మాస్టారు రంగస్థలం సినిమా తో కూడా బాగా ఆకట్టుకున్నాడు.సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై కుమారి 21ఎఫ్ (2015), ఉప్పెన (2021), విరూపాక్ష (2023) వంటి సినిమాలను కూడా ఈ దర్శకుడు ప్రొడ్యూస్ చేశాడు.

ఈ మూవీలోని ప్రొడ్యూస్ చేస్తుంది మరెవరో కాదు ఆయన దగ్గర శిష్యరికం చేసినవారే.ఇలా శిష్యులను ఎంకరేజ్ చేస్తూ మంచి సినిమాలను తెలుగువారికి అందిస్తున్నాడు సుకుమార్‌.

రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ కుమారి 21F (2015)ను సుకుమార్ రచించాడు.ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దీన్ని డైరెక్ట్ చేసాడు.

మొత్తంగా ముగ్గురు సుకుమార్ శిష్యులు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు.సినిమాలో కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసి సంచలన రికార్డులను నెలకొల్పాయి.

ఈ ముగ్గురు దర్శకులు కూడా సుకుమార్ స్టూడెంట్స్ అంటారు.అయితే లెక్కల మాస్టర్ దగ్గర చదువుకున్న మిగతా స్టూడెంట్స్ కూడా మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు కానీ వారు మాత్రం ఫామ్ లోకి రాలేకపోయారు.

ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటించిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా (2021)” సినిమాని దర్శకుడు మున్నా ధూళిపూడి ( Munna Dhulipudi )డైరెక్ట్ చేశాడు అతను కూడా సుకుమార్‌ శిష్యుడే.కానీ తన ఫస్ట్ ఫాంటసీ రొమాన్స్ సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు.

ఇప్పటిదాకా అతను ఫామ్ లోకి రాలేకపోయాడు.ఈ సినిమా అయితే 13 కోట్లతో బాక్సాఫీస్ సక్సెస్ అయ్యింది కానీ కంటెంట్ బాగా లేకపోవడంతో వాటిని ఇంతవరకు మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు.

Telugu Sukumar, Failure, Failure Sukumar, Munna Dhulipudi, Palnatisurya, Prakash

ప్రకాష్ తోలేటి( Prakash Toleti ) సుకుమార్ వద్ద చాలా సినిమాల కోసం డైరెక్టర్ గా పని చేశాడు.ఆ తర్వాత రానా దగ్గుబాటి, జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రలు పోషించిన రొమాంటిక్ ఫిలిం “నా ఇష్టం” మూవీతో డైరెక్టర్‌గా మారాడు.ఈ సినిమా పెద్దగా ఆడలేదు అందువల్ల అతడు ఫామ్ లోకి రాలేకపోయాడు.

Telugu Sukumar, Failure, Failure Sukumar, Munna Dhulipudi, Palnatisurya, Prakash

సుకుమార్ శిష్యుడు జక్కా హరి ప్రసాద్( Zakka Hari Prasad ) “దర్శకుడు” సినిమా తీశాడు.దాని తర్వాత సైన్స్ ఫిక్షన్ డ్రామా ఫిల్మ్ “ప్లేబ్యాక్ (2021)” డైరెక్ట్ చేసి ఆకట్టుకున్నాడు.ఈ మూవీ బాగానే ఉంటుంది కానీ కొన్ని లూప్ హోల్స్ ఉండటం వల్ల భారీ హిట్ కాలేకపోయింది.

చాలామంది క్రిటిక్స్ ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో ఒక మూవీ చేయడం నిజంగా గ్రేట్ అంటూ పొగిడారు కూడా.రెండూ ఫెయిల్ కావడంవల్ల అతను ఫామ్ లోకి రాలేకపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube