బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ 2 సింహాసనాన్ని అధిష్టించి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా యూకేలో ఘనంగా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే.ఈ సంబరాల్లో భారతీయులు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
జూన్ రెండు నుంచి ఐదో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా క్వీన్ ఎలిజబెత్‌కు విషెస్ తెలియజేసిన బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం.
ఈ సమయంలో ఢిల్లీకి చెందిన పర్యావరణవేత్త సునీతా నారాయణ్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
శనివారం రాత్రి బకింగ్‌హామ్ ప్యాలెస్ వెలుపల జరిగిన గ్రాండ్ జూబ్లీ పార్టీలో ప్రసంగించిన ప్రిన్స్ విలియం పర్యావరణంపై మాట్లాడారు.
ఈ సందర్భంగా అమెరికా కి చెందిన రాచెల్ కార్సన్, కెన్యాకి చెందిన వంగరి మాథై, భారత్‌కు చెందిన సునీతా నారాయణ్ వంటి పర్యావరణ వేత్తల గురించి ప్రస్తావించారు.క్వీన్ ఎలిజబెత్ ఒక శతాబ్దం పాటు ఎన్నో చూశారని.
ఈ సమయంలో మానవజాతి అనూహ్యమైన సాంకేతిక అభివృద్ధిని సాధించిందని ప్రిన్స్ విలియమ్ అన్నారు.ఇకపోతే.
క్వీన్ ఎలిజబెత్ -2 శనివారం నాటి పార్టీకి హాజరుకాలేదు.ఆదివారం జూబ్లీ వేడుకల చివరి రోజు బకింగ్ హామ్ ప్యాలెస్ సమీపంలో భారీ ప్రదర్శనతో ముగిసింది.
కాగా ఢిల్లీలో పుట్టి పెరిగిన సునీతా నారాయణ్‌ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు.1982లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్‌లో.ఆ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ అగర్వాల్‌తో కలిసి పనిచేశారు.పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాశారు.పర్యావరణ పరిరక్షణపై చేస్తున్న కృషికి గాను సునీతా నారాయణ్‌కు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి.2005లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆమెను సత్కరించింది.ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా టైమ్ మ్యాగజైన్ 2016లో ఎంపిక చేసింది.ఇక 2020లో ప్రతిష్టాత్మకమైన ఎడిన్‌బర్గ్ మెడల్‌ను సునీతకు బహూకరించారు.