డీఎండీకే అధినేత విజయ కాంత్ కు ఈసీ షాక్...పార్టీ ప్రాంతీయ హోదా రద్దు

నటుడు,డీఎండీకే అధినేత విజయ కాంత్ కు గట్టి షాక్ తగిలింది.ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ ప్రాంతీయ హోదాను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.

 Election Commission Gave A Shock To Dmdk Party-TeluguStop.com

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తో పొత్తుపెట్టుకుని ఎన్నికల్లో పోటీకి దిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం 6 శాతం ఓట్లను కూడా పొందలేక దారుణంగా ఓడిపోయింది.

దీనితో నిబంధనల ప్రకారం కనీసం 6 శాతం ఓట్లు కూడా సంపాదించలేక పోవడం తో ఆ పార్టీ ప్రాంతీయ హోదాను కోల్పోయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.లోక్ సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసిన డీఎండీకే అభ్యర్థులకు కేవలం 2.19 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.

-Telugu Political News

అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కి 3 శాతం మాత్రమే ఓట్లు రావడం, లోక్ సభ ఎన్నికల్లో కూడా కేవలం తక్కువ శాతం ఓట్లు లభించడం తో ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది.దీనితో ఈ ఫలితాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం పై మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.మొత్తానికి ఈ సారి అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకున్నందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది.

ఒకపక్క ఎన్నికల్లో ఓటమి పాలవ్వడమే కాకుండా ఇప్పుడు ప్రాంతీయ పార్టీ గా ఉన్న హోదా ను కూడా ఆ పార్టీ పోగొట్టుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube