జుట్టు పొడవుగా,ఒత్తుగా ఉంటేనే ముఖానికి అందం రెట్టింపు అవుతుంది.జిడ్డు చర్మం వలె జిడ్డు జుట్టు కూడా ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు.
జిడ్డు జుట్టును సంరక్షణ చేయటం కూడా ఒకింత కష్టమే.అయితే మనం ఇంటిలో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో తలలో జిడ్డు సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు.
ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
విట్చ్ హాజల్ + గ్రీన్ టీరెండు స్పూన్ల చల్లారిన గ్రీన్ టీలో ఒక స్పూన్ విట్చ్ హాజల్ ని వేసి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట సేపు ఆలా వదిలేయాలి.ఆ తర్వాత తేలికపాటి షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానము చేయాలి.
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
టీ ట్రీ ఆయిల్ + ఆలివ్ ఆయిల్రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ ని వేసి బాగా కలపాలి.
ఈ నూనెను తలకు పట్టించి వేడి నీటిలో ముంచిన కాటన్ టవల్ తలకు చుట్టి 15 నిమిషాల పాటు ఉంచి చన్నీళ్లతో తలస్నానము చేయాలి.ఈ విధంగా క్రమం తప్పకుండ నెల రోజుల పాటు చేస్తే తలలో జిడ్డు సమస్య తొలగిపోతుంది.
గుడ్డు పచ్చసొన + నిమ్మరసంఒక గుడ్డు పచ్చసొనలో రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి తలకు పట్టించి నాలుగు గంటల పాటు ఆలా వదిలేసి తేలికపాటి షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానము చేయాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే తలలో జిడ్డు తొలగిపోతుంది.