కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై మీ పిల్లల అభిప్రాయాలను ప్రభావితం చేయవద్దని ఓ భారత సంతతి తండ్రికి సింగపూర్ కోర్ట్ ఆదేశించింది.తన అనుమతి లేకుండా తన భార్య తమ ఇద్దరు కుమార్తెలకు టీకాలు వేయకుండా నిరోధించాలని అతను పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం శనివారం కొట్టివేసింది.
ఛానెల్ న్యూస్ ఏషియా కథనం ప్రకారం.సదరు భారతీయ తల్లిదండ్రులు ప్రస్తుతం విడాకుల ప్రక్రియలో వున్నారు.వీరి ఇద్దరు కుమార్తెలు స్టూడెంట్ పాస్‌లపై సింగపూర్‌లో వుంటున్నారు.అతని భార్య విడాకులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన తర్వాత .పిటిషన్‌దారుడు సింగపూర్‌లో వుంటున్న కుమార్తెల పాస్‌లను రద్దు చేశాడు.ఛానెల్ కథనంలో తల్లీదండ్రుల పేర్లు కానీ, పిల్లల పేర్లు కానీ తెలియజేయలేదు.
అయితే తండ్రికి ఎలాంటి లక్షణాలు లేని అనారోగ్యం వున్నట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అతను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలను బేరీజు వేసుకుని .దానిని తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.
తాను వ్యాక్సిన్‌లకు వ్యతిరేకంగా కాదని.
తన కుమార్తెలకు ఇండియాలో అవసరమైన అన్ని టీకాలను వేయించానని అతను కోర్టుకు సమర్పించిన పత్రాలలో తెలియజేశాడు.అయితే టీకాపై వున్న వైద్య పరమైన ఆందోళనలు తండ్రికి సంబంధించినవేనని.
పిల్లలకు సంబంధం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు ఛానెల్ తన కథనంలో పేర్కొంది.వ్యాక్సినేషన్‌పై తండ్రి ఆందోళనను అర్ధం చేసుకున్నామని.
కానీ పిల్లలకు వారి ఆరోగ్యం గురించి అవగాహన లేనందున టీకాలు వేయించుకోవడాన్ని అడ్డుకోలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు.
కోవిడ్ 19 టీకాలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తండ్రి అందుకు ఎలాంటి చట్టబద్ధమైన కారణం చూపలేదని న్యాయమూర్తి చెప్పారు.
ఆ వ్యక్తి కోరిన విధంగా టీకాలకు సంబంధించి పిల్లల ప్రయోజనాలను తాము అడ్డుకోలేమన్నారు.చిన్నారుల సంక్షేమమే ప్రభుత్వానికి, న్యాయస్థానానికి పరమావధి అని పేర్కొన్న న్యాయమూర్తి.ఇద్దరు బాలికలకు వ్యాక్సినేషన్ ప్రయోజనకరమని స్పష్టం చేశారు.టీకాలపై పిల్లల అభిప్రాయాలు ప్రభావితమయ్యాయని తల్లి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా న్యాయమూర్తి పరిగణనలోనికి తీసుకున్నారు.
వ్యాక్సిన్‌లు పరీక్షించబడవని, అసురక్షితమైనవని, అసమర్ధమైనవని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పిల్లలకు చెప్పవద్దని తండ్రిని కోర్ట్ ఆదేశించింది.అలాగే ఇతరులను కూడా ఈ తరహా చర్యలకు అనుమతించరాదని న్యాయమూర్తి సూచించారు.దీనితో పాటు వ్యాక్సిన్ భద్రతను , సామర్ధ్యాన్ని ప్రశ్నించే ఏదైనా విషయాలను సినిమాలు, సోషల్ మీడియా, వెబ్‌సైట్ ద్వారా చూపవద్దని కోర్ట్ ఆదేశించింది.