ఇక్కడ ఏటీఎం కార్డులు వాడనివారు అంటూ ఎవరూ వుండరు.ఈ కాలంలో దాదాపు అందరికీ ఆయా బ్యాంకులు డెబిట్ కార్డ్స్ ని జారీ చేస్తున్నాయి.
దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి, ప్రధాన మంత్రి జన్-ధన్ యోజన( RuPay PMJDY Card ), రూపే కార్డ్ వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంగతి విదితమే.వీటి వల్లనే ఎక్కువగా ఏటీఎం కార్డులు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయాయని చెప్పుకోవచ్చు.
నగదు రూప లావాదేవీలపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, డబ్బును సురక్షితంగా, లావాదేవీలను సులభతరం చేసాయి ఈ కార్డులు.

అయితే మనలో ఏటీఎం కార్డులు వాడుతున్న వారికి ఈ విషయం తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.ఒక బ్యాంకు తన ఖాతాదారుడికి ఏటీఎం కార్డు జారీ చేసిన క్షణం నుంచి ఆ ఖాతాదారు ప్రమాద బీమా, జీవిత బీమా పరిధిలోకి వస్తాడు.దీనికి సంబంధించిన సమాచారం అందరికీ తెలియకపోవడంతో కొద్ది మంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు.
ఈ విషయంపై విస్తృత అవగాహన కల్పించకపోవడం బ్యాంకుల తప్పయితే, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం ప్రజల తప్పు అని అనుకోవాలి.

ఏటీఎం కార్డు( Atm card ) హోల్డర్ అనుకోని కారణాల వలన ప్రమాదానికి గురైతే, ఆ కార్డ్ అతని కుటుంబానికి లేదా వైద్య ఖర్చులకు అండగా నిలబడుతుంది.ప్రమాదంలో ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే… అతనికి రూ.50,000 ప్రమాద బీమా కవరేజీ( Accident insurance ), రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోయినట్లయితే, ఒక లక్ష రూపాయల బీమా మొత్తం లభిస్తుంది.ఇక దురదృష్టవశాత్తు కార్డు హోల్డర్ మరణిస్తే, ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు కవరేజీ అతని కుటుంబానికి లభిస్తుంది.
గమనిక:
ప్రమాద సమయంలో, ATM కార్డ్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే, ప్రమాదానికి గురైన కార్డుదారు, ఆ ప్రమాదానికి కనీసం 45 రోజుల ముందయినా ఆ ఏటీఎం కార్డుని ఉపయోగించి ఉండాలి.అప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది.