మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు సినిమాల ద్వారా కమర్షియల్ యాడ్స్( Commercial ads ) ద్వారా కోట్లు సంపాదిస్తూ ఉంటారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాకుండా వారి భార్యలు కూడా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.
కానీ ఈ విషయం బయట చాలా మందికి తెలియదు.మరి ముఖ్యంగా బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో అయితే స్టార్ హీరోలకి మించి డబల్ స్థాయిలో కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు.
అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ గౌరీ ఖాన్( Gauri Khan ).ఈమె ఎవరో కాదు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వైఫ్.
నిర్మాతగా, ఇంటీరియర్ డిజైనర్ గా పలు వ్యాపారంగంలో సక్సెస్ఫుల్ ఉమెన్ గా దూసుకెళ్తున్న ఈమె రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్( Red Chillies Entertainment Banner ) పై వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వెబ్ సిరీస్ లు నిర్మిస్తూనే ఉంటుంది.మరోవైపు ఇంటీరియర్ డిజైనర్ గా కూడా రానిస్తోంది.గౌరీ షారుక్ ఖాన్ కి మించిన రేంజ్ లో కోట్లు సంపాదిస్తోంది.కాగా హీరో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) ఎంత పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒక్కో సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే.అయితే గౌరీ అలా కాదు ఒక్క టైం సినిమా సక్సెస్ అయ్యిందా ? కొన్ని కోట్లు వచ్చి ఆమె ఖాతాలో చేరుతాయి.
మరి ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనర్( Interior designer ) కొన్ని వందల కోట్లు దాచి పెట్టింది అన్న న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతోంది.అలాగే గౌరీ ఖాన్ నికర విలువ దాదాపు 27,325 కోట్లు విలువ ఉంటుందని సమాచారం.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు.షారుక్ ఖాన్ భార్యకు ఏకంగా అన్ని వేల కోట్ల ఆస్తి ఉందా అంటూ షాక్ అవుతున్నారు.
కాగా షారుక్ ఖాన్ భార్యకు ముంబైలో ఒక లగ్జరీ హోటల్ కూడా ఉంది.ఆ హోటల్ ని ఆమె స్వయంగా డిజైన్ చేసుకుంది.అంతేకాదు గౌరీఖాన్ కి చిరాస్తులు కూడా ఉన్నాయి.