అల వైకుంఠపురములో బాటలో డిస్కో రాజా!

మాస్ రాజా రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం డిస్కో రాజా అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.

 Disco Raja Digital Rights Not Sold To Amazon Netflix-TeluguStop.com

ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏమిటనేది సస్పెన్స్‌గా పెట్టిన చిత్ర యూనిట్ ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాను జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా ఈ సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడగలరని చిత్ర యూనిట్ పేర్కొంది.అల వైకుంఠపురములో సినిమా డిజిటల్ రైట్స్ అంశంలో సరికొత్త విధానానికి తెరలేపింది.

ఈ సినిమాను అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫాంలకు హక్కులను అమ్ముకోలేదు.దీంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు చిత్రాన్ని వీలైనన్ని రోజులు ఎక్కువగా థియేటర్‌లలో ప్రదర్శించేందుకు చూస్తున్నారు.

ఇప్పుడు అదే బాటలో డిస్కో రాజా చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తు్న్నారు చిత్ర యూనిట్.ఈ సినిమా డిజిటల్ హక్కులను ఎవరికీ అమ్మకపోవడంతో ఈ సినిమాను కూడా కేవలం థియేటర్లలో మాత్రమే చూడగలరంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube