జక్కన్నను ప్రశంసించిన డైరెక్టర్ శంకర్.. 'మహారాజ'మౌళి అంటూ బిరుదు..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా గత కొన్ని ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు.

 Director Shankar Appreciates Rajamouli's Rrr, Director Shankar, Appreciates, Ntr-TeluguStop.com

కానీ ఇప్పటి వరకు కరోనా అడ్డంకిగా మారడంతో ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది.కానీ ఎట్టకేలకు ఈ సినిమా నిన్న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అత్యంత భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది ఆర్ఆర్ఆర్ సినిమా.ఇక ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలెబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ తర్వాత సోషల్ మీడియా అంతటా సందడి నెలకొంది.సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ మ్యానియా చూసి జక్కన్న టీమ్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

విడుదల అయిన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో రాజమౌళి ప్రతిభ మరోసారి నిరూపితం అయ్యింది.

ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనపై అందరు సంతృప్తిగా ఉన్నారు.వీరి నటన, డ్యాన్స్, వీరి స్నేహం సినిమాకే హైలెట్ గా నిలిచాయని చెప్పుకుంటున్నారు.అలాగే దర్శక ధీరుడు రాజమౌళి స్టోరీ లైన్, ఆయన విజన్, ఒక్కో సన్నివేశాన్ని కూడా ఆయన తెరమీద చూపించిన తీరుకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు.

దీంతో రాజమౌళి ని ప్రశంసిస్తూ పలువురు ట్వీట్ చేస్తున్నారు.

తాజాగా డైరెక్టర్ శంకర్ కూడా సినిమా చూసిన తర్వాత రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తారు.రావిషింగ్, రివెటింగ్, రోబస్ట్, రోర్ అన్ని సమయాల్లో ప్రతిధ్వనిస్తుంది.అంశమానమైన అనుభవాన్ని అందించినందుకు మొత్తం టీమ్ కి థాంక్స్ తారక్ రేడియంట్ భీం, రామ్ చరణ్ ర్యాగింగ్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్.

మీ హృదయాన్ని ఆకర్షిస్తాడు.మీ ఊహ అజేయంగా ఉంటుంది మహారాజ మౌళికి అభినందనలు అంటూ సోషల్ మీడియాలో లెజెండరీ డైరెక్టర్ మరొక లెజెండరీ డైరెక్టర్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

https://twitter.com/shankarshanmugh/status/1507410281408135168?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1507410281408135168%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fntvtelugu.com%2Fdirector-shankar-syas-hats-off-to-rajamouli%2F
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube