ఐప్యాక్ సంస్థపై మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఐప్యాక్ సంస్థ( IPAC ) వైసీపీకి పనిచేయడం తెలిసిందే.వైయస్ జగన్( YS Jagan ) పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి ఈ సంస్థ.

 Ex Minister Kottu Satyanarayana Sensational Comments On Ipac Organization Detail-TeluguStop.com

ఏపీలో వైసీపీ పార్టీకి( YCP ) సేవలు అందిస్తూ ఉంది.పార్టీ నాయకుల పనితీరు పట్ల ఇంకా అప్పట్లో జగన్ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల నాడీని తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు.

సూచనలు సలహాలు వైఎస్ జగన్ కి ఇచ్చేది.ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కూడా… ఇదే రకంగా వ్యవహరించటం జరిగింది.

ఐప్యాక్ సంస్థ సర్వేబట్టి వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను నిలబెట్టినట్లు వార్తలు వచ్చాయి.కానీ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది.

కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి దక్కలేదు.ఈ క్రమంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ) ఐప్యాక్ సంస్థపై శనివారం సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలలో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ( Volunteer System ) ఐప్యాక్ సంస్థ అని స్పష్టం చేయడం జరిగింది.వాళ్లను నమ్మి వైయస్ జగన్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు సముచిత స్థానం కల్పించలేదు.

ఐప్యాక్ పనికిమాలిన సంస్థ.అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పబ్బం గడుపుకున్నారు.

ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదికలు పంపారు అంటూ కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube