ఆ సినిమాలో మిమ్మల్ని తీసుకున్నందుకు బాధ పడుతున్నా.. నటుడిపై సందీప్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో ఒకరైన సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ దర్శకుడి తర్వాత సినిమా ప్రభాస్ హీరోగా స్పిరిట్( Spirit ) అనే టైటిల్ తో తెరకెక్కుతోంది.

 Director Sandeep Reddy Vanga Comments Goes Viral In Social Media Details, Sandee-TeluguStop.com

సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను హిందీలో కబీర్ సింగ్ అనే టైటిల్ తో తెరకెక్కించి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కబీర్ సింగ్( Kabir Singh ) సినిమాలో నటించిన అదిల్ హుస్సేన్( Adil Hussain ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటివరకు నా సినీ కెరీర్ లో ఎందుకు నటించానా అని బాధపడిన సినిమా కబీర్ సింగ్ మాత్రమేనని ఆయన అన్నారు.

ఆ సినిమాలో కాలేజ్ డీన్ గా నేను నటించానని అదిల్ హుస్సేన్ వెల్లడించారు.నేను ఎన్నిసార్లు నో చెప్పినా ఒకే ఒకసారి షూట్ కు రావాలని అన్నారని అదిల్ హుస్సేన్ పేర్కొన్నారు.

ఆ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని అదిల్ హుస్సేన్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.వాళ్లు చెప్పిన సీన్ యాక్ట్ చేసి వచ్చేశానని ఆయన పేర్కొన్నారు.ఆ సీన్ మంచిగా అనిపించిందని సినిమా కూడా అలాగే ఉంటుందని భావించానని అదిల్ హుస్సేన్ వెల్లడించడం గమనార్హం.విడుదలయ్యాక కబీర్ సింగ్ సినిమా చూసి ఈ సినిమాలో ఎందుకు నటించానా అని ఫీలయ్యానని అదిల్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.

స్నేహితుడితో కలిసి సినిమా చూడటానికి వెళ్లేన నేను మధ్యలోనే బయటకు వచ్చేశానని అదిల్ హుస్సేన్ అన్నారు.అదిల్ చేసిన కామెంట్ల గురించి సందీప్ స్పందిస్తూ మిమ్మల్ని కబీర్ సింగ్ సినిమాలో తీసుకున్నందుకు ఇప్పటికీ బాధ పడుతున్నానని తెలిపారు.ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐతో ఫిల్ చేస్తానని సందీప్ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube