టాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.బాలీవుడ్ బ్యూటీ అయిన మృణాల్ ఠాకూర్ తెలుగులో ఇప్పటివరకు మూడే మూడు సినిమాలలో నటించింది.
ఈ మూడు సినిమాలతో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ లాంటి మూడు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్( Family Star ) మూవీలో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది.
ఇది ఇలా ఉంటే, నెట్టింట మృణాల్ కి సంబంధించిన జిమ్ ( Gym ) వీడియో వైరల్ గా మారింది.మామలుగా తన అందచెందాలతో ఆకట్టుకునే మృణాల్ ఠాకూర్ జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ బాడీ ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తోంది.అయితే ఈ వర్క్ అవుట్స్ చేయడానికి మృణాల్ జిమ్ లో ఇష్టం లేకుండా కష్ట పడుతున్నారు.జిమ్ ట్రైనర్ మృణాల్ ని దగ్గరుండి ట్రైన్ చేస్తున్నాడు.అయితే జిమ్ ట్రైనర్( Mrunal Gym Trainer ) చూడని సమయంలో వర్క్ అవుట్స్ ఆపేసి రిలాక్స్ అవుతున్న మృణాల్.ట్రైనర్ రాగానే వర్క్ అవుట్స్ చేస్తున్నట్లు ఫుల్ కవరింగ్ ఇస్తున్నారు.
ఇలా తన జిమ్ ట్రైనర్ ని మోసం చేస్తున్న వీడియోని మృణాల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
ఆ వీడియో చూడడానికి చాలా క్యూట్ గా ఉండడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ మృణాల్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా క్యూట్ గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఆ వీడియో పై కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.
వితౌట్ మేకప్ లో కూడా బాగున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.