డైరెక్టర్ శైలేష్ కొలను( Sailesh Kolanu ) త్వరలోనే వెంకటేష్ ( Venkatesh ) హీరోగా నటించిన సైందవ్ ( Saindhav ) సినిమా ద్వారా దర్శకుడిగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే చిత్ర బృందం పలు దైవదర్శనాలను చేసుకుంటూ తమ సినిమాని ప్రమోట్ చేస్తూ వచ్చారు.అయితే తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా ఒక సినిమా గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది ఈ సినిమా గురించి శైలేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
అప్పట్లో నేను హైదరాబాద్ కి రావడం వల్ల మీరు నటించిన అభయ్( Abhay )సినిమా థియేటర్లో చూడలేకపోయాను.ఇలా ఈ సినిమాని థియేటర్లో చూడలేకపోయాను అనే బాధ నన్ను దాదాపు రెండు దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉందని శైలేష్ వెల్లడించారు.ఈ సినిమాని థియేటర్లో చూడలేకపోయినా మీ నటనకు ప్రేమలో పడ్డాను అందుకే నా కొడుకుకు అభయ్ అనే పేరు కూడా పెట్టుకున్నానని తెలిపారు.ఎట్టకేలకు 22 సంవత్సరాలకు ఈ సినిమాని తిరిగి థియేటర్లో చూసే అవకాశం లభించింది.
నేను జీవితాంతం వెతికిన మీకు కృతజ్ఞతలు చెప్పడానికి నాకు సరైన పదాలు దొరకవు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
ఇలా 22 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఈ సినిమా గురించి ఈయన ఇలాంటి పోస్ట్ చేశారు.మరి ఈ సినిమాలో ఎవరు నటించారు ఏంటి అనే విషయానికి వస్తే కమల్ హాసన్( Kamal Hassan) హీరోగా, రవీనా టాండన్ ( Raveena Tandon ) హీరోయిన్ గా నటించిన ఆళవందన్ అనే సినిమా 2001 వ సంవత్సరంలో హిందీ భాషలో విడుదలైంది.అయితే ఈ సినిమాని తెలుగులో అభయ్ అనే పేరిట విడుదల చేశారు.
ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించారు.అయితే ఇటీవల ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దీంతో శైలేష్ కొలను చేసినటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ వైరల్ గా మారింది.