పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD( Kalki 2898-AD )పాన్ వరల్డ్ మూవీగా టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో హోప్స్ పెట్టుకుని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ హోప్స్ ను రీచ్ అవ్వాలని మేకర్స్ సైతం బాగా కష్ట పడుతున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరల్డ్ క్లాస్ లెవల్లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా ముందుకు వెళుతుంది.ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా నాగ్ అశ్విన్ అండ్ టీమ్ ముందు నుండి ప్లాన్ ప్రకారం వెళుతున్నారు.
ఇక నాగ్ అశ్విన్ తాజాగా ఈ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొన్ని కామెంట్స్ చేసారు.ఈ సినిమాకు ముందుగా విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్నీ కూడా ఇండియాలోనే చేయిద్దాం అనుకున్నాను.కానీ కొన్ని కారణాల వల్ల సాధ్యం అవ్వలేదు.అయితే దాదాపు చాలా వరకు ఇక్కడే పూర్తి చేయడానికి ట్రై చేశామని తెలిపారు.
అలాగే నెక్స్ట్ తన సినిమాకు మాత్రం పూర్తిగా ఇండియన్ టాలెంట్ తోనే బెటర్ గా విఎఫ్ఎక్స్ వర్క్ ను చేసిన కంప్లీట్ ఇండియన్ ప్రాజెక్ట్స్ చేస్తానని చెప్పిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై 500 కోట్ల భారీ బడ్జెట్ తో అశ్వనీ దత్( Aswani Dutt ) నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఇందులో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్స్ భాగం అయ్యారు.