మణిరత్నం తీసిన పోన్నియన్ సెల్వన్ అందరూ ఊహించినట్టుగానే తమిళంలో మినహా ఎక్కడ ఆడని పరిస్థితి.తమిళ వారికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న సినిమా అయినప్పటికీ మిగతా భాషల వారికి ఈ చిత్రం పెద్దగా ఎక్కలేదు వాస్తవానికి పొన్నియన్ సినిమాకు మంచి చరిత్ర అయితే ఉంది కానీ అది మిగతా వారికి పెద్దగా తెలియదు.
ఇక బాలీవుడ్ వారికైతే తెలిసే అవకాశం లేదు అందుకే ఆ పేర్లు కానీ వారి వస్త్రధారణ గాని అర్థం కాక జుట్టు పీక్కున్న పరిస్థితి.మణిరత్నం తన జీవిత ఆశయంగా పెట్టుకొని ఈ సినిమా తీస్తున్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే.
ఇప్పటికే వచ్చిన మొదటి పార్ట్ కు తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు జాబితాలో అయితే చేరింది కానీ తమిళం మినహా మిగతా భాషల్లో ఈ చిత్రం క్లియర్ ఫ్లాప్ గా చెప్పుకోవచ్చు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆ రెండవ భాగం షూటింగ్ కూడా దాదాపుగా మొదటి పాటు తోనే పూర్తి చేశాడు దర్శకుడు.ఎడిటింగ్ డబ్బింగ్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ మినహా షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయింది.ఏప్రిల్ 18 వ తారీఖున ఈ సినిమా రెండవ పార్ట్ ను విడుదల చేయాలని మొదటి పార్ట్ విడుదలవుతున్న సమయంలోనే ప్రకటించేశారు.
కానీ సినిమా రషెస్ చూసిన మణిరత్నం కి చాలా వరకు సీన్స్ నచ్చడం లేదట.ఈ సినిమాలో దాదాపు ఐశ్వర్యరాయ్ మినహా మిగిలిన వారందరూ తమిళ భాషకు సంబంధించిన వారే.
అయితే మణిరత్నం ఆశిస్తున్న సీన్స్ మళ్లీ రీ షూట్ చేయాలంటే చాలా గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
చాలా పెద్ద క్యాస్టింగ్ కాబట్టి అందరు డేట్స్ దొరకడం కష్టంతో కూడుకున్న పని.పైగా మొదటి భాగం అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు తమిళ వెర్షన్ మినహా మిగతా భాషల డబ్బింగ్ పై దర్శకుడు ఏమాత్రం దృష్టి పెట్టలేదు.ఇక రెండవ భాగంపై జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళనాడు భాగం ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దాంతో మణిరత్నం ఈ సినిమాను ఇప్పట్లో విడుదల చేసే ఆలోచనను విరమించుకున్నాడట.ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలేకపోతున్నారు.