ప్రముఖ డైరెక్టర్ క్రిష్ ( Krish )గత మూడేళ్ళ నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరో గా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు‘ ప్రాజెక్ట్ లోనే ఉన్నాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే.కరోనా కి ముందు జెట్ స్పీడ్ లో సాగిన ఈ సినిమా షూటింగ్ కరోనా తర్వాత మాత్రం నత్త నడకన సాగింది.
లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రం కేవలం రెండు షెడ్యూల్స్ ని మాత్రమే జరుపుకుంది.ఒక షెడ్యూల్ ని 45 రోజుల పాటు షూట్ చేసారు, ఈ షెడ్యూల్ తర్వాత పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రానికి షిఫ్ట్ అయ్యాడు.
ఆ తర్వాత ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్‘( Ustaad Bhagat Singh ) సినిమాలు చేస్తున్నాడు కానీ, ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి ఊసే లేదు.డైరెక్టర్ క్రిష్( Director Krish ) వేచి చూసి చూసి విసుగెత్తిపోయాడు.
దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.దానికి సాక్ష్యంగా ఈరోజు ఒక పోస్టర్ మరియు వీడియో విడుదల అయ్యింది.‘కభీ అప్నే.కభీ సప్నే’ అనే పేరుతో అల్లు అర్జున్ మరియు కొంతమంది బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో ఈ పోస్టర్ వచ్చింది.
ఇదేంటి అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నాడు కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా, ఇది సినిమానా లేదంటే యాడ్ షూటింగా అని అందరూ అనుకున్నారు.దీని గురించి మూవీ టీం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ యాడ్ షూటింగ్ అయితే పర్వాలేదు కానీ, సినిమా షూటింగ్ అంటేనే సమస్య అని పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు .ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్‘ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ ఈ నెలాఖరు వరకు జరగనుంది.
ఈ షూటింగ్ అయిపోగానే ఆయన ‘వారాహి విజయ యాత్ర‘ నాల్గవ విడత మొదలు పెట్టనున్నాడు.ప్రస్తుతానికి అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్.ఈ సినిమా పూర్తి అయినా తర్వాత ఆయన ‘హరి హర వీరమల్లు’ ( Hari Hara Veera Mallu ) మరియు ‘ఓజీ’ చిత్రాలకు డేట్స్ ఇస్తాడట.
ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మరో రూమర్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ కి మరియు డైరెక్టర్ క్రిష్ కి సరిగా పడడం లేదని, పవన్ కళ్యాణ్ కి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ అసలు నచ్చలేదని, అందుకే ఈ సినిమా నుండి అతన్ని తప్పించి తానే దర్శకత్వం వహించడమో, లేదంటే వేరే డైరెక్టర్ కి అప్పగించడంతో జరుగుతుంది అని అంటున్నారు.ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.