మహేంద్రసింగ్ ధోని తీర్చిదిద్దిన ఐదుగురు భారత జట్టు కీలక ఆటగాళ్లు వీళ్లే..!

మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ) భారత జట్టుకు రెండు వరల్డ్ కప్ ట్రోఫీలు సాధించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఏకంగా ఐదు మంది ఆటగాళ్లను తీర్చిదిద్ది భారత జట్టుకు కీలక ఆటగాళ్లుగా తయారు చేశాడు.మహేంద్రసింగ్ తీర్చిదిద్దిన ఐదు మంది ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

 These Are The Five Key Players Of The Indian Team Trained By Mahendra Singh Dho-TeluguStop.com

రోహిత్ శర్మ:

రోహిత్ శర్మ 2007లో టీ20 ప్రపంచ కప్ జట్టులో కీలక సభ్యుడుగా ఉన్నాడు.కానీ తన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడంలో ఘోరంగా విఫలమై 2011 ప్రపంచ కప్ ఆడే జట్టుకు ఎంపిక కాలేదు.అయితే మహేంద్రసింగ్ ధోని 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు రోహిత్ శర్మను పంపించాడు.ధోని నమ్మకాన్ని నిలబెట్టి భారత జట్టుకు తిరుగులేని ఓపెనర్ గా ఎదిగాడు రోహిత్ శర్మ.

విరాట్ కోహ్లీ:

2011-12 లో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో అరంగేట్రం చేసి, ప్రస్తుతం భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే 2012లో పెర్త్ లో విరాట్ కోహ్లీ( Virat Kohli )కి బదులు రోహిత్ శర్మను సెలెక్టర్లు ఆడించాలని కాస్త ఆసక్తి చూపించారు.కానీ మహేంద్రసింగ్ ధోని మాత్రం కోహ్లీని ఆడించాలని నిర్ణయించాడు.

వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీ కే ఓటు వేశాడు.ఇలా అవకాశాలు ధోని ఇవ్వడం వల్లనే ప్రస్తుత భారత జట్టు సారధిగా కోహ్లీ ఎదిగాడు.

Telugu Msdhoni, Ravindra Jadej, Rohit Sharma, Suresh Raina, Virat Kohli-Sports N

రవీంద్ర జడేజా

: రవీంద్ర జడేజా ను భారత జట్టులోకి తీసుకొచ్చింది మహేంద్రసింగ్ ధోనీనే.2013లో జడేజా అన్ని ఫార్మాట్లలో భారతదేశపు ప్రముఖ స్పిన్ బౌలర్ ఆల్ రౌండర్ గా ఎదిగాడు.ప్రస్తుతం భారత జట్టులో తిరుగులేని స్పిన్నర్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.

సురేష్ రైనా:

ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు సురేష్ రైనాకు అధికంగా అవకాశాలు ఇవ్వడంతో భారత మిడిల్ ఆర్డర్లో సురేష్ రైనా( Suresh Raina ) తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.మహేంద్రసింగ్ ధోని రెండు సిరీస్ లను కోల్పోయినప్పుడు రైనా కెప్టెన్ గా ఎలివేట్ అయ్యాడు.

Telugu Msdhoni, Ravindra Jadej, Rohit Sharma, Suresh Raina, Virat Kohli-Sports N

రవిచంద్రన్ అశ్విన్:

అశ్విన్( Ravichandran Ashwi ) చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుత ఆటను ప్రదర్శించడంతో టెస్టు, వన్డే ఫార్మాట్ రెండింటిలోనూ అశ్విన్ ను అరంగేట్రం చేయించింది మహేంద్రసింగ్ ధోనీనే.తర్వాత అశ్విన్ జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube