ఒట్టోమన్ రక్త చరిత్రలో ఉంపుడుగత్తెలు, బానిసలే కీలకపాత్ర పోషించేవారని మీకు తెలుసా?

చరిత్రలను గురించి చదువుకున్న వారికి ఒట్టోమన్( Ottoman ), ఒట్టోమన్ సామ్రాజ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇపుడు మనం ఒట్టోమన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మహిళలు గురించి మాట్లాడుకుంటున్నాము.

 Did You Know That Concubines And Slaves Played An Important Role In Ottoman Bloo-TeluguStop.com

సుమారు 600 ఏళ్లకు పైగా సాగిన ఒట్టోమన్ సామ్రాజ్య చరిత్రలో దాదాపు సుల్తాన్‌ల తల్లులందరూ బానిసలే.కాదు కాదు… సుల్తానులకు( Sultans ) జన్మనిచ్చింది బానిస స్త్రీలే.

గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటైన ఒట్టోమన్‌ పాలనా వ్యవహారాల్లో మహిళల ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది.వారిలో చాలా మంది అంత:పురం దాటివచ్చేవారు కాదు.వారిని కేవలం శృంగార సాధనాలుగా, లేదంటే కేవలం సుల్తాన్‌లకు పిల్లలను కనిచ్చే యంత్రాలుగా మాత్రమే చూసేవారు… అని ఒట్టోమన్ ఉమెన్ ఇన్ పబ్లిక్ స్పేస్ పుస్తకంలో ఎబ్రు బోయర్( Ebru Boyer ) రాసుకొచ్చారు.

ఒట్టోమన్ సామ్రాజ్యపు యువరాజులు, సుల్తానుల వివాహాల్లో ప్రేమ కంటే… కేవలం రాజకీయ, వ్యూహాత్మక కారణాలే ఉండేవని సమాచారం.ఉదాహరణకు, పొరుగు రాజ్యంతో పొత్తు పెట్టుకునేందుకు అవతలి రాజ్యపు రాజుల కూతుళ్లను భార్యలుగా చేసుకునేవారట.ముఖ్యంగా రాజ్యాలతో ఎలాంటి సంబంధాలు లేని స్త్రీలతో తమ వారసులను కనేందుకు సుల్తాన్‌లు మక్కువ చూపేవారని అయన తన పుస్తకంలో రాసుకొచ్చారు.

పచ్చిగా చెప్పాలంటే రాజ్యానికి కాబోయే యువరాజులు, భవిష్యత్తు సుల్తానులను భార్యలతో కాకుండా ఉంపుడుగత్తెలతో కనేందుకు సుల్తానులు బాగా ఇష్టపడేవారట.

సుల్తానులు సంతానం పొందాలని అనుకుంటే, బానిసలు ఉండే అంత:పురంలోని ఒక అందమైన స్త్రీని ఎంపిక చేసుకునేవారు.వారిలో ఇతర రాజ్యాలకు చెందిన రాజుల కూతుళ్లు ఉంటే వారిని పక్కన బెట్టి, మిగతావారిలో ఎంచుకొనేవారట.ఎందుకంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం వివాహ బంధంలో ఉన్న స్త్రీతో బిడ్డ పుట్టినా, లేదా అలాంటి సంబంధం లేని మహిళతో బిడ్డ పుట్టినా అది చట్టబద్ధమే.

అంతేకాకుండా ఒక బిడ్డ భార్యకు, మరో బిడ్డ ఉంపుడుగత్తెకు పుట్టిన సందర్భంలో, సింహాసనం అధిష్టించేందుకు ఇద్దరికీ సమాన హక్కులు ఉండేవట.దాంతో సవతి తల్లి కొడుకులు ఒకరినొకరు నరుక్కొని ఒకరు ఛస్తే మరొకరు సింహాసనాన్ని చేజిక్కించుకొనేవారట.ఒట్టోమన్ రాజ్యం ఆక్రమణల ద్వారా, లేదా ఇతర పద్ధతుల్లో అనేక మంది స్త్రీలను బలవంతంగా తమ రాజధానికి తరలించేవారు.600 ఏళ్లకు పైగా సాగిన ఒట్టోమన్ సామ్రాజ్య చరిత్రలో దాదాపు సుల్తాన్‌ల తల్లులందరూ బానిసలే అయినప్పటికీ తమ కొడుకుల్ని సుల్తానుల సామ్రాజ్యానికి వారసుల్ని చేయడంలో మాత్రం మంచి సిద్ధహస్తులని ‘ఎబ్రు బోయర్’ పేర్కొన్నారు.

The history of blood and Ottoman Empire

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube