ఈ సువిశాల ప్రపంచంలో అనేక రకాల వింత జీవులున్నాయి.వీటిలో కొన్నిటిని చూసినప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
అటువంటి వాటిలో ప్లాటిపస్ జీవులు( Platypus ) ఒకటి.ఇవి చూసేందుకు ఎంతో విచిత్రంగా ఉంటాయి.
వీటి ముఖం బాతు ముక్కుని పోలివుంటుంది.ఇక దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది.
ఇది క్షీరద జాతికి( Mammal Species ) చెందిన జీవులు.వీని ప్రత్యేకత ఏమిటంటే, ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.
గుడ్లను కూడా పెడుతుంది.ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో 5 రకాలు మాత్రమే ఉన్నాయి.
1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ జీవులను కనుగొన్నారు.దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.పొంతన లేని విధంగా ఉండడంతో వారు తెగ ఆశ్చర్యపోయారు.వారు మొదట ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు.తొలుత దీనిని 2 జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు.ప్లాటిపస్ ఇతర జీవులు ఇతర జీవులు నుంచి రక్షణ కోసం విషం( Platypus Venom ) జిమ్ముతుంటుంది.
దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది.దానిలో విషం ఉంటుంది.
తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుందన్నమాట.
అయితే, మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వలన ఎటువంటి హాని జరగదు.తట్టుకోలేకంత నొప్పి అయితే కలుగుతుంది.ప్లాటిపస్ ఒక రకమైన మోనోట్రిమేటా క్రమానికి చెందిన క్షీరదాలు.
వీని శాస్త్రీయనామం ఆర్నితోరింకస్ అనాటినస్. ఇవి ఆర్నితోరింకిడే కుటుంబంలో ఆర్నితోరింకస్ ప్రజాతికి చెందినవి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి తూర్పు ఆస్ట్రేలియా ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తాయి.ముఖ్యంగా మగ ప్లాటిపస్ కున్న వెనుక కాలు ద్వారా విషాన్ని చిమ్మి మనుషులకు తీవ్రమైన నొప్పిని కలుగజేస్తాయి.
దీనికున్న ఇలాంటి విశిష్టమైన లక్షణాల కారణంగా జీవశాస్త్రంలో పరిశోధనాంశముగా వీటిని చూస్తారు.ఇది న్యూ సౌత్ వేల్స్ దేశపు జంతు చిహ్నం అని చాలామందికి తెలియదు.
చాలా కాలం వీటిని తోలు కోసం చంపేసేవారు, అయితే ప్రస్తుతం వీనిని రక్షిస్తున్నారు.