బాహుబలి సినిమాను ఇంతమంది మిస్ చేసుకున్నారా.. రాజమౌళి మీద నమ్మకం లేకే ఆ నిర్ణయం?

కొన్ని సినిమాలకు కొందరికి మంచి పేరునీ తీసుకు వస్తే, మరికొన్ని సినిమాలు మరికొంతమందిని వెనక్కి తీసుకెళ్తాయి.ఇంకొన్ని సినిమాలు మరికొందరికి భారీ అవకాశాలను తెచ్చిపెడతాయి అదేవిధంగా పోకిరి సినిమాతోనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ కొట్టి, మళ్లీ ఫామ్ లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

 Bahubali, Tollywood, Pan India, Movie, Miss, Rajamouli , Hrithik Roshan, Jhon Ab-TeluguStop.com

ఇక బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఖ్యాతిని సంపాదించిపెట్టింది.

అంతేకాకుండా వేల కోట్లు సంపాదించి పెట్టిన మొదటి తెలుగు సినిమా బాహుబలి 2 నే కావడం చెప్పుకోదగిన విషయం.అయితే ఈ సినిమా వెనుక చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయంటే నమ్ముతారా .

మొదటగా ఈ సినిమాని రాజమౌళిగారు హిందీలో తీయాలని అనుకున్నారట.అలా మొదలైన తన ఆలోచనతో బాహుబలి పాత్రకు హృతిక్ రోషన్ ను, అలాగే బల్లాల దేవ పాత్రకు జాన్ అబ్రహంను అనుకున్నారట.

అయితే తర్వాత ఎందుకో ఈ ఆలోచనను ఆయన మార్చుకున్నారు.

Telugu Bahubali, Hrithik Roshan, Jhon Abraham, Kiravani, Mohan Laal, Pan India,

ఇదిలా ఉండగా ప్రభాస్ నాన్నగారు దివంగత సూర్యనారాయణరాజు తన కొడుకును ఒక కింగ్ పాత్రలో ఒక వారియర్ గా చూడా చూడాలని ఉండేది అన్నట్టు చత్రపతి సమయంలో కీరవాణి, రాజమౌళికి చెబుతుండేవారట.అంతేకాకుండా కీరవాణిని ప్రారంభ సమయంలో ప్రోత్సహించింది ప్రభాస్ తండ్రి గారే.ఆ తర్వాత రాజమౌళి గారికి హిందీలో బాహుబలి తీయాలన్నా ఆలోచనతో పాటు తెలుగులో కూడా తీస్తే బాగుంటుందని అనుకున్నారట.

మొదట ఈ సినిమాను తీయడానికి ఒక భారీ ఈ సంస్థ ముందుకు వచ్చింది.కానీ, ఎందుకో తప్పుకుంది.ఆ తర్వాత ఆర్కామీడియా వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంటే అసలు బాహుబలి మొదటి ఛాయిస్ ఎవరు ? అసలు బాహుబలి ఆఫర్ను ఎందుకు రిజెక్ట్ చేశారు .

Telugu Bahubali, Hrithik Roshan, Jhon Abraham, Kiravani, Mohan Laal, Pan India,

బాహుబలి సినిమాకు గాను హీరో క్యారెక్టర్ ను అనుకొన్నది హృతిక్ రోషన్, బల్లాల దేవా పాత్రకు రానా బదులు జాన్ అబ్రహంను అనుకున్నారు రాజమౌళి.శివగామి క్యారెక్టర్ కు శ్రీదేవిని అనుకుంటే దాన్ని ఆమె తిరస్కరించగా, ఆ తర్వాత అదే పాత్రకు మంచు లక్ష్మిని కూడా సంప్రదించినట్లు సమాచారం.అయితే ప్రభాస్ తల్లి పాత్ర తాను కూడా చేయను అని మంచు లక్ష్మీ కరాఖండిగా చెప్పేసిందట.అయితే తమన్నా క్యారెక్టర్ అవంతిక కూడా బాలీవుడ్ యాక్టర్ సోనం కపూర్ ని అనుకున్నారట.

కానీ రెండేళ్లు షూటింగా అని ఆమె కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Bahubali, Hrithik Roshan, Jhon Abraham, Kiravani, Mohan Laal, Pan India,

ఇకపోతే కట్టప్ప.ఈ క్యారెక్టర్ సినిమా వెన్నెముక లాంటిది.అయితే ఈ పాత్ర కు మొదటగా రాజమౌళి గారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని అనుకున్నారట.

కానీ ఆయన కూడా రిజెక్ట్ చేయడంతో ఆ క్యారెక్టర్ కు సత్య రాజ్ ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Bahubali, Hrithik Roshan, Jhon Abraham, Kiravani, Mohan Laal, Pan India,

ఇలా ఎంతో అద్భుతమైన సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ సినిమాను వదులుకొని ఆ సినిమా అఖండ విజయం సాధించిన తర్వాత ఇంత మంచి సినిమాని వదులుకున్నందుకు ఎంతో బాధపడినట్లు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube