Tabu: అప్పట్లో నాగార్జున కోసం టబు విషం తాగిందా.. భయంతో నాగార్జున ఏం చేశారంటే..?

నవ మన్మధుడి గా యువ సామ్రాట్ గా కింగ్ గా గ్రీకువీరుడి గా ఇలా టాలీవుడ్ లో అమ్మాయిల కలల రాకుమారుడుగా ఎందరో అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా ఉన్న నాగార్జున( Nagarjuna ) ఇప్పటికి కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు.ఇక ఆయన ఎలాంటి జానర్ లో వచ్చిన సినిమాలోనైనా సరే ఇట్టే దూరిపోయే రకం.

 Did Tabu Drink Poison For Nagarjuna Then What Did Nagarjuna Do Out Of Fear-TeluguStop.com

భక్తి సినిమాలైనా, ఫ్యామిలీ కి సంబంధించిన సినిమాలైనా,లవ్ రొమాంటిక్ సినిమాలు అయినా, యాక్షన్ సినిమాలైనా సరే ఇలా ఏ సినిమాలో అయినా సరే తన నటనతో అందరినీ ఆకట్టుకుంటారు.అయితే అలాంటి నాగార్జున కి టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోయిన్ టబు( Tab u) తో ఎఫైర్ ఉందని ఇప్పటికే ఎన్నో వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

ఇక ఇప్పటికి కూడా టబు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం కొంతమంది నాగార్జున అంటే మరి కొంత మంది అజయ్ దేవగన్ ( Ajay Devaga n) అంటూ ఉంటారు.ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే అప్పట్లో నాగార్జున కోసం టబు విషంతాగిందట.

ఇక భయంతో నాగార్జున ఏం చేశారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.టబు నాగార్జున పెళ్లి చేసుకోవడం లేదనే విషం తాంగిదా అని మీ అందరిలో అనుమానం కలగవచ్చు.

Telugu Ajay Devagan, Amala, Krishna Vamshi, Nagarjuna, Tabu, Tabu Poison-Movie

అయితే టబు తాగింది నిజ జీవితంలో కాదు సినిమా షూటింగ్లో భాగంగా.నాగార్జున టబు కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా ( Ninne Pelladutha ) సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇటు యూత్ కి ఎంతగా కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో టబూ విషం తాగుతుంది.అయితే ఈ విషయం ముందుగా కృష్ణవంశీ నాగార్జునకి చెప్పకుండా కేవలం హీరోయిన్ వచ్చి కౌగిలించుకుంటుంది అని మాత్రమే చెప్పారట.

Telugu Ajay Devagan, Amala, Krishna Vamshi, Nagarjuna, Tabu, Tabu Poison-Movie

ఇక కృష్ణవంశీ (Krishna Vamshi) వేసిన అసలు ప్లాన్ నాగార్జున కి తెలియదు.ఇక అప్పుడే టబు వచ్చి నాగార్జున ని హగ్ చేసుకొని బ్లడ్ రూపంలో వాంథింగ్ చేసుకుంటుంది.ఇక ఆ బ్లడ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన నాగార్జున గట్టిగా అరిచి టబు విషం తాగింది అని భయపడిపోయారట.ఇక నాగార్జున అరిచినా అరుపుకి కృష్ణవంశీ షూటింగ్ ఆపేసి సార్ టబు విషం తాగలేదు.

ఇది షూటింగ్లో భాగంగానే.అయితే ఈ సన్నివేశం మీకు ముందుగా చెప్పలేదు అని అన్నారట.

కానీ నాగార్జున ( Nagarjuna ) మాత్రం నాకెందుకు ఈ సీన్ చెప్పలేదు అంటే నేచులర్ గా సీన్ రావడం కోసం ఇలా చేశాను అని కృష్ణవంశీ చెప్పారట.దాంతో కాస్త కోపంగా వెళ్లి తాను ఎలా చేశాను అని మానిటర్ దగ్గరికి వెళ్లి చూసుకున్నారట నాగార్జున.

కానీ అందులో నేచురల్ గా తన యాక్టింగ్ వచ్చేసరికి నాగార్జున కూడా బానే ఉంది అని మెచ్చుకున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube