చిన్న పిల్లలకు గుడ్‌న్యూస్.. 6 నుంచి 12 ఏళ్ల పిల్లల కోసం కోవాగ్జిన్ టీకా రెడీ!

మీ ఇంట్లో చిన్నపిల్లలున్నారా? అయితే మీకు ఓ శుభవార్త.కోవాగ్జిన్ వ్యాక్సిన్ కి DCGI అనుమతి లభించింది.6 – 12 ఏళ్ల పిల్లల కోసం కోవాగ్జిన్ ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.ప్రస్తుత పరిస్థితులలో వ్యాక్సినేషన్ విషయంలో ఇది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు.

 Dgci Covaxin For Children Between 6 To 12 Years Of Age Details,  Kids, Good News-TeluguStop.com

దేశవ్యాప్తంగా పిల్లలకు వ్యాక్సిన్లు త్వరలో ఇస్తామని కేంద్రం ఇప్పటికే చెప్పి వుంది.కాగా కరోనా ఫోర్త్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్న తరుణంలో ఈ శుభవార్త రావడం శుభపరిణామమే అని చెప్పుకోవాలి.

అందుకనే తాజాగా పిల్లలకు వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది.మార్చి నెలలో, 12 నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు టీకాలు వేసిన విషయం అందరికీ తెలిసినదే.

ఈ క్రమంలో ఇప్పుడు DCGI 6 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు కోవాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.వాస్తవానికి, కరోనా వైరస్ చివరి వేవ్ లో పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదు.

కానీ పిల్లలు కూడా ఈ కొత్త వేరియంట్ XE ప్రభావం పడే ఛాన్స్ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాబట్టి ఈ అద్భుత అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కేంద్రం సూచిస్తోంది.

Telugu Age, Yeras, Corona, Covaxin, Covid, Dgci, Vaccine-Latest News - Telugu

సమ్మర్ తరువాత పాఠశాలలు మరలా తెరుస్తారు కావున కేసులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.గత 3 వారాల్లో పిల్లలలో ఫ్లూ లాంటి లక్షణాలు అధికంగా పెరిగాయి.అదే సమయంలో ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం త్వరలో ఒక మార్గదర్శకాన్ని జారీ చేయవచ్చని ఎదురు చూస్తున్నారు.

త్వరలోనే ఈ విషయమై కేంద్రం నుండి ఓ నోటిస్ రాబోతుందని ఆశిస్తున్నారు.ఇక కేంద్రం కూడా ఆ వైపుగా చర్యలు చేపడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube