డైరెక్ట్ OTT లో నాని సినిమా..!

టైటిల్ చూసి కొద్దిగా షాక్ అవడం ఖాయమే.నాచురల్ స్టార్ నాని తను నటించిన వి, టక్ జగదీష్ సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేశాడు.

అయితే ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.ఇక థియేటర్ లో రిలీజైన శ్యాం సింగ రాయ్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది.

ఇక మీదట తన సినిమాలు ఓటీటీ రిలీజ్ చేసేది లేదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు నాని.అయితే ఇలా అనుకున్న నాని తన సినిమా మళ్లీ ఓటీటీ రిలీజ్ కి మొగ్గు చూపుతున్నాడని తెలుస్తుంది.

అయితే నాని హీరోగా చేస్తున్న సినిమా ఓటీటీ రిలీజ్ కాకుండా తను నిర్మిస్తున్న సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు.నాని నిర్మాతగా కూడా తన టేస్ట్ ఏంటన్నది చూపిస్తున్నాడు.

Advertisement

ఈ క్రమంలో నాని లేటెస్ట్ గా మీట్ క్యూట్ సినిమా చేస్తున్నాడు.తన సోదరి దీప్తి గంటా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

సినిమాలో సత్యరాజ్, అదా శర్మ, వర్ష బొల్లమ్మ, రుహాని శర్మ, ఆకాంక్ష సింగ్, శివ కందుకూరి నటిస్తున్నారు.ఈ సినిమాను నాని నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కే నాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు