బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha )బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఇటీవల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసు వాస్తవాలను న్యాయస్థానం పరిశీలించాలని ఆమె పిటిషన్ లో కోరారు.ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
కాగా ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు.