ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.ఈ మేరకు మంగళగిరిలో ఆయన వైసీపీ అభ్యర్థులకు మద్ధతుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల్లో ఏపీలో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు.ఐదేళ్ల భవిష్యత్ ను, పథకాల( Schemes) కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవని పేర్కొన్నారు. 59 నెలల పాలనలో ఏకంగా రూ.2 లక్షల 71 వేల కోట్లను అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో వేశామని సీఎం జగన్ తెలిపారు. ఐదేళ్లలో లంచాలు, వివక్ష లేకుండా పాలన అందించామన్నారు.ఈ క్రమంలోనే జగన్ కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు.పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలికినట్లేనని వెల్లడించారు.