దేత్తడి హారిక గతంలో ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేసిందో తెలుసా?

ఒకప్పుడు వెండి తెర మీద కనిపిస్తేనే సెలబ్రిటీలు అనుకునేవారు.సినిమాల్లో నటిస్తేనే నటులుగా భావించేవారు.

 Detthadi Harika Unknown Facts , Detthadi Harika , Unknown Facts , Celebrities-TeluguStop.com

కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా  మారిపోయింది.సోషల్ మీడియా విస్త్రుతి ఎప్పుడైతే పెరిగిపోయిందో.

అప్పుడే ఎంతో మంది సెలబ్రిటీలు పుట్టుకొచ్చారు.తమకున్న అద్భుత టాలెంట్ ను సోషల్ మీడియా ద్వారా బయటి ప్రపంచానికి చూపించారు.జనాల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నారు.ప్రస్తుతం మామూలు జనాల నుంచి సెలబ్రిటీల దాకా.అందరికీ సోషల్ మీడియానే పెద్ద వేదికగా మారింది.చాలా మంది సినిమా తారలకు మించి ఫేమస్ అవుతున్నారు.

అలా ఫేమస్ అయి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన అమ్మాయే దేత్తడి హారిక.

సాధారణంగా ఈమెను హారిక అంటే ఎవరూ గుర్తు పట్టలేరు.

దేత్తడి హారిక అంటే మాత్రం ఈజీగా గుర్తు పడతారు.అచ్చం  తెలంగాణ యాసలో ఈ అమ్మాయి చెప్పే డైలాగులు చాలా ఫేమస్ అయ్యాయి.

యూట్యూబ్ లో ఈమె చేసే వీడియోలకు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

ప్రస్తుతం ఈమె ఓ సెలబ్రిటీగా మారిపోయింది.ఈ దెబ్బతో బిగ్ బాస్ కూడా ఈమెకు సాదరణ స్వాగతం పలికాడు.

తాజా సీజన్ లో ఆమె బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టింది.దీంతో తనకు మరింత ఫేమ్ వచ్చింది.

సోషల్ మీడియాలో ఈమె గురించి చూడ్డం తప్ప.తన బ్యాగ్రౌండ్ ఏంటో మాత్రం జనాలకు పెద్దగా తెలియదు.ఈమె అసలు పేరు అలేఖ్య హారిక.దేత్తడి హారిక గానే ఫేమస్ అయ్యింది.ఈమె చదువు అయిపోగానే తొలుత కొంత కాలం జాబ్ చేసింది.అది కూడా అమెజాన్ కంపెనీలో.

చాలా మంచి  పొజిషన్ లోనే ఉద్యోగం.అయినా సరే తనకు నటన మీద ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ.

ఈ నేపథ్యంలో తన జాబ్ ను వదిలేసింది.ఆ తర్వాత యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసింది.

కొన్ని షార్ట్ ఫిల్స్మ్ చేసింది.కొన్ని మంచి పాటలకు కవర్ సాంగ్స్ కూడా చేసింది.

అయితే వీటితో తనకు పెద్దగా క్రేజ్ మాత్రం రాలేదు.ఆ తర్వాత దేత్తడి హారిక పేరుతో ఓ సిరీస్ చేసింది.

అప్పుడే తన దశ తిరిగింది.ఈ సిరీస్ బాగా ఫేమస్ అయ్యింది.

ఆమె నటనతో పాటు గ్లామర్ షో పెంచడంతో వ్యూవర్ షిప్ బాగా పెరిగింది.ప్రస్తుతం మంచి గుర్తింపు అందుకుంది.

.

Dettadi Harika Personal Life Facts #dettadiharika

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube