బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు తెగ వెడిక్కిస్తున్నాయి.ఓ పక్క సీఎం కేసీఆర్ బీజేపీని ఏకి పారేస్తుంటే… మరో పక్క ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కూడా తనదైన స్టైల్‌లో బీజేపీ నేతలపై విరుచుకుపడుతున్నాడు.
హ్యాష్ ట్యాగ్‌పేరుతో కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు.బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఇటీవల చేసిన కామెంట్లు చర్చణీయాంశంగా మారింది.
కిషన్‌రెడ్డి చేసిన ట్వీట్లకు కేటీఆర్ కూడా ఘాటుగా సమాధానాలివ్వడం గాలి దుమారాన్ని లేపుతున్నాయి.
కేంద్రం రాష్ట్రానికి చేకూర్చిన ప్రయోజనం ఏమీ లేదంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో సహా మంత్రులు, నేతలు కూడా బీజేపీని ఇరకాటంలో పెడుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా తామూకూడా తగ్గదేలేదంటూ టీఆర్ఎస్ నేతలకు తరచూ కౌంటర్లు వేస్తున్నారు.రీసెంట్ గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీపై ట్వీట్ చేశాడు.
ఇదే అదనుగా కేటీఆర్ అదే ట్వీట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తెలంగాణలో మోడీ పర్యటన సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్‌తో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం ఇది అంటూ ట్వీట్ చేశాడు.
రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని, వివక్ష చూపుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామంటూ కామెంట్ చేస్తూనే కిషన్‌రెడ్డిపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేయడం చర్చకు దారి తీస్తోంది.కేంద్ర వివక్ష పై తాను ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా సంబంధం లేని వాటిని తెరమీదకు తేవడం ఏమిటని సెటైర్ వేయడం చర్ఛనీయాంశమైంది.అలాగే రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్రం ఏమి చేయలేదని, కిషన్‌రెడ్డి వివరణ ఇవ్వాలంటూ విరుచుకుపడడం బీజేపీ నేతలకు మింగుడు పడడంలేదు.
మొత్తంగా ట్విట్టర్ వేదిక ద్వారా హ్యాష్ ట్యాగ్ పేరుతో చేసిన ట్వీట్లు రెండు పార్టీల్లోనూ సెగలు రేపుతున్నాయి.