ఈ నిర్ణయం కరక్టేనా.. సీఎం కేసీఆర్ పై దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం.. ?

ఉన్నట్టుండి పిడుగులు పడ్డట్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహారం మారిందని, ఇన్ని రోజుల నుండి ప్రజలు చస్తున్నా కరోనా విషయంలో కీలక చర్యలు చేపట్టని సీఎం కేసీఆర్ ఒక్క సారిగా జనం మీద ప్రేమ పొంగి పోయినట్లుగా తన నిర్ణయాలను ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొంటున్నారు.

 Dasoju Shravan Key Remarks On Cm Kcr, Dasoju Shravan, Aicc, Key Remarks, Cm Kcr-TeluguStop.com

ఈ రోజూ హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ ఇంతకాలం నుండి కరోనాను ఆరోగ్య శ్రీ లో చేరుస్తామని మభ్యపెట్టి రాత్రికి రాత్రే ఆయుష్మాన్ భారత్ లో చేరుస్తున్నట్లు ప్రకటించడం వెనక ఉన్న మర్మం ఏంటో ఆయనకే తెలుసని ఎద్దేవా చేశారు.

ఇదంతా పక్కన పెడితే ఒకగానొక సమయంలో ఆయుష్మాన్ భారత్ ద్వారా 26 లక్షల మంది లబ్ది పొందుతారు.అదే ఆరోగ్య శ్రీ అయితే 77 లక్షల మంది లబ్దిపొందే అవకాశం ఉందని చెప్పిన సీఎం కేసీఆర్ మిగతా వారికి ఎలా న్యాయం చేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

మొత్తానికి హడావుడిగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కరక్టేనా అని సీఎం కేసీఆర్ పై దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube