విశ్వంత్, శుభశ్రీ హీరో హీరోయిన్ గా దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ నూతన చిత్రం ప్రారంభం!!

దండమూడి బాక్సాఫీస్ మరియు సాయి స్రవంతి మూవీస్ పతాకంపై విశ్వంత్,శుభశ్రీ ,ఆలీ, సునీల్, రఘుబాబు,ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ నటీనటులుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి సంయుక్తంగా కలసి నూతన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఉగాది సందర్భంగా ఈ చిత్రం షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాల ఘనంగా జరుపుకుంది.

 Dandamudi Box Office, Sai Sravanthi Movies Launch New Movie With Vishwant, Subha-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వవ్భిన స్టార్ కమెడియన్ అలీ హీరో హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, దండమూడి అవనీంద్ర కుమార్ కెమెరా స్విచాన్ చేశారు.అనంతరం

చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టెక్నీషియ‌న్స్ అందరూ ఎంతో అనుభ‌వంతో పాటు ఎంతో ప్ర‌తిభావంతులు మా చిత్రానికి ప‌ని చేస్తున్నారు.నాపై నమ్మకంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు.

ఈ రోజు నుండి ఏకధాటిగా షూటింగ్ ప్రారంభం జరుపు కుంటుంది.ఈ సినిమాకు సీనియర్ నటులు పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.

చిత్ర నిర్మాతలు అవనీంద్ర కుమార్, సాయి గొట్టిపాటి మాట్లాడుతూ .ఉగాది పర్వదినాన ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన అథితులందరికీ మా ధన్యవాదాలు.కృష్ణ చైతన్య చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంబించాము.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం పతి ఒక్కరికే తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.

నటీనటులు:

విశ్వంత్, శుభశ్రీ , ఆలీ, సునీల్, రఘుబాబు,ఈ రోజుల్లో సాయి, ఖయ్యుం, సత్యం రాజేష్ తదితరులు

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ : ఈశ్వర్.ఎడిటర్ అమర్ రెడ్డి, మ్యూజిక్ : శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్ : అంజి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి గొట్టిపాటి, నిర్మాత : అవనీంద్ర కుమార్, కథ మాటలు స్క్రీన్ప్లే దర్శకత్వం : కృష్ణచైతన్య పి.ఆర్.ఓ : సురేందర్ నాయుడు, ఫణి (బియాండ్ మీడియా)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube