ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఓటీపీ స్కాం!

సైబర్‌ నేరగాళ్ల మోసాలు రోజుకోవిధంగా మారుతున్నాయి.కానీ, వారి అల్టిమేట్‌ టార్గెట్‌ మాత్రం ఖాతాల నుంచి డబ్బులు కాజేయడం.

 Cyber Hackers Targeting Sbi Customers By Sending Fake Url Links Cyber Crime , Fa-TeluguStop.com

తాజాగా ఎస్‌బీఐ వినియోగదారులకు మరో వల పన్నే ప్రయత్నం చేస్తున్నారు.కేవైసీ అప్డేట్‌ అంటూ.

ఎస్‌బీఐ ఖాతాదారుల జేబులకు చిల్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఖాతాదారులకు ఓ లింగ్‌ పంపుతున్నారు.ఆ వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్‌ చేస్తే దాదాపు రూ.50 లక్షల గిఫ్ట్‌ గెలుచుకునే అవకాశమని బ్యాంక్‌ నఖిలీ లింక్‌ ద్వారా వాట్సాప్‌ మెసేజ్‌ పంపుతున్నారు దీన్నే మనం పిషింగ్‌ అని కూడా అంటున్నాం.సైబర్‌ సెక్యూరిటీ పరిశోధకులు కూడా దీనిపై హెచ్చరిస్తున్నారు.చైనాకు చెందిన హ్యాకర్లు ఎస్‌బీఐ కస్టమర్లను ఈ విధంగా లక్ష్యం చేసుకున్నారు.ఢిల్లీకి చెందిన టాంక్‌ సైబర్‌ పీస్‌ ఫౌండేషన్, ఆటోబట్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఈ విధంగా రెండు ఘటనలు తమ దృష్టికి వచ్చాయట.మొదట జరిగిన సంఘటనలో ఓ టెక్స్‌›్ట మెసేజ్‌ కేవైసీ రిక్వెస్ట్‌ వచ్చిందట.

అది అచ్చం ఎస్‌బీఐ బ్యాంకుకు సంబంధించిన అసలు వెబ్‌సైట్‌ పేజీ మాదిరిగానే ఉందట.ఆ పేజీలోకంటిన్యూ టూ లాగిన్‌బటన్‌ను క్లిక్‌ చేయగానే కేవైసీ.పీహెచ్‌పీ పేజీ ఓపెన్‌ అవుతుంది.అందులో కస్టమర్లకు సంబంధించిన సమాచారం అడుగుతోంది. యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్, కాప్చా అడుగుతోంది.తద్వారా వారి పర్సనల్‌ బ్యాంకింగ్‌లోకి లాగిన్‌ అవ్వడానికి.ఆ తర్వాత వెంటనే మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.దాన్ని ఎంటర్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది.

Telugu Cyber, Links, Messge, Sbi Alart-Latest News - Telugu

ఇందులో కూడా ఎస్‌బీఐ కస్టమర్‌కు సంబంధించిన పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌ అడిగింది.అక్కడ ఖాతాదారుడి పేరు, మొబైల్‌ నంబర్, పుట్టిన రోజు సమాచారం ఎంటర్‌ చేయగానే ఓటీపీ పేజీకి రిడైరెక్ట్‌ అయ్యిందని సైబర్‌ నిపుణులు తెలిపారు.£ý ర్డ్‌ పార్టీ నుంచి వస్తున్న ఈ లింక్‌తో అందరూ అలర్ట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.కస్టమర్లను మోసగించడానికే వారు పంపిస్తున్న మెసేజ్‌ పేజీ కూడా ఎస్‌బీఐ బ్యాంక్‌ ఒరిజినల్‌ వెబ్‌సైట్‌ని పోలింది పంపిస్తున్నారు.

దీనిపై ఎస్‌బీఐ ఇంకా స్పందించలేదు.

Telugu Cyber, Links, Messge, Sbi Alart-Latest News - Telugu

ఇక రెండో కేసులో ఎస్‌బీఐ వినియోగదారులకు అద్భుతమైన గిఫ్ట్‌లను అందుకోవచ్చంటూ వాట్సాప్‌ మెసేజ్‌ పంపించారు.ఇందులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను పోలి ఉన్న పేజీ ఓపెన్‌ అవుతుంది.దాంట్లో కంగ్రాట్స్‌ ఎస్‌బీఐ నిర్వహిస్తున్న సర్వేలో కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాలని లింక్‌లో ఉంటుంది.సరైన సమాధానం చెప్పిన వారికి రూ.50 లక్షలు గెలుచుకునే అవకాశం ఉంటుందని ఖాతాదారుడికి పంపించారని సైబర్‌ నిపుణులు తెలిపారు.పేజీ కింది భాగంలోఫేస్‌బుక్‌ కమెంట్‌ సెక్షన్‌లానే ఉంది.అందులో యూజర్లు గిఫ్ట్‌ ద్వారా వారు లబ్ది పొందినట్లు కామెంట్స్‌ పెట్టారు.అందుకే నిపుణులు సోషల్‌ మీడియా ద్వారా వచ్చే ఏ వెబ్‌సైట్‌ లింక్‌లను ఓపెన్‌ చేయకూడదని హెచ్చరిస్తున్నారు.ఐడీఎఫ్‌సీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ కస్టమర్లను ఈ విధంగానే పిషింగ్‌ ద్వారా టార్టెట్‌ చేసుకున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మార్చిలో ఇటువంటి ఇంకో ఘటన జరిగింది.ఇందులో ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.9,870 క్రెడిట్‌ పాయింట్స్‌ రిడీమ్‌ చేసుకోమని మెసేజ్‌ వచ్చింది.ఏప్రిల్‌ అయితే లోన్‌ ఈఎంఐ మారటోరియం పొందడానికి ఓటీపీ షేర్‌ చే యమని పంపించారు.

దీనిపై ఎస్‌బీఐ తక్షణమే వారి వినియోగదారులను అలర్ట్‌ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube